ఏసీబీకి చిక్కిన మక్తల్ సీఐ
మక్తల్: ఓ కేసు విషయంలో వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌కు చెందిన సందె వెంకట్రాములు మక్తల్‌లో శ్రీనిధి సొసైటీని ఏర్పాటు చేశారు. సొసైటీలో కొందరు వ్యక్తులతో బేధాభిప్రాయాలు రావడంతో మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరు ఫిర్యాదు చేయడంతో సందె వెంకట్రాములుపై కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా.. ప్రతి సోమవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌కు రావాలని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ వచ్చింది.
ఆఫీసు, ఇళ్లలో సోదాలు..
కేసుకు సంబంధించిన చార్జీషీటు కోర్టులో దాఖలు చేయాల్సిన విషయంలో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను మక్తల్ సీఐ జి.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సందె వెంకట్రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం మంగళవారం మక్తల్ పోలీస్ కార్యాలయంలో నిందితుడి నుంచి కానిస్టేబుల్ నర్సింహ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివారెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయం, కానిస్టేబుళ్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాడుల్లో ఏసీబీ అధికారులు లింగస్వామి, జిలాని సయ్యద్, వెంకట్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment