
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
గోపాల్‌పేట: మండలంలోని చెన్నూరుకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించి మార్చి 15 నాటికి బేస్‌మెంట్ లెవెల్ వరకు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కోరారు. బుధవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా చెన్నూరులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించి ఆవరణను పరిశీలించారు. మురుగు సమస్యను వెంటనే పరిష్కరించాలని, మెనూ విధిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత బుద్దారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీచేసి వంటగదిని పరిశీలించారు. బియ్యం, కూరగాయలు చూసి మెనూ పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి బోధన వివరాలు తెలుసుకొని వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం తాడిపర్తిలో వైకుంఠధామాన్ని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి నీటి సరఫరా, ఇతర సమస్యలపై ఆరా తీశారు. నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ శంకర్‌నాయక్, ఇతర మండలాల అధికారులు ఉన్నారు.
మార్చి 15 నాటికి
బేస్‌మెంట్ లెవల్ పూర్తికావాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
సంచిత్ గంగ్వార్
Comments
Please login to add a commentAdd a comment