
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరిగాయి. కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాట్లు, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ రావుల గిరిధర్, కొత్తకోటలోని పరీక్ష కేంద్రాన్ని డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరావు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. జిల్లాకేంద్రంలోని వాగ్దేవి, సీవీ రామన్, త్రివేణి, విజ్ఞాన్ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను డీఐఈవో ఎర్ర అంజయ్య తనిఖీ చేశారు. జనరల్ విభాగంలో 5,798 మంది విద్యార్థులకుగాను 5,663 మంది హాజరుకాగా.. 132 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం 8.25కి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఎస్, డీవోలు ప్రశ్నాపత్రాలు ఉంచిన ప్రదేశాన్ని పరిశీలించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు వేర్వేరుగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ఎస్పీ వెంట సీఐ కృష్ణ, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.
కేంద్రాలను తనిఖీ చేసిన
కలెక్టర్, ఎస్పీ, డీఐఈఓ

ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment