
దివ్యాంగులకూ గుర్తింపు
సదరం ధ్రువీకరణ పత్రాల జారీకి స్వస్తి పలకనున్న ప్రభుత్వం
●
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం..
కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం యూడీఐడీ కార్డు తీసుకురావడం హర్షణీయం. సదరం ధ్రువపత్రం గడువు ముగిసిన ప్రతిసారి స్లాట్ బుక్ శిభిరానికి వెళ్లి రెన్యూవల్ చేసుకునేందుకు ఇబ్బందులు ఉండేవి. కొత్త విధానంలో దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా యూడీఐడీ కార్డు అందించడంతో దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. – ప్రభుస్వామి, జిల్లా అధ్యక్షుడు,
దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక
నెలాఖరు వరకు అవకాశం..
దివ్యాంగులు యూడీఐడీ కార్డుల కోసం మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. నెలాఖరుకు స్లాట్ బుకింగ్ ముగుస్తుంది. సదరం శిభిరాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే కార్డు వస్తుంది.
– ఉమాదేవి, డీఆర్డీఓ
అమరచింత: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన గుర్తింపుకార్డు అమలులోకి తీసుకురానుండటంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు జారీ చేస్తున్న సదరం ధ్రువపత్రాలకు ఇక నుంచి స్వస్తి పలకనుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో యూడీఐడీ (యూనిక్ డిసెబులిటీ ఐడెండిటీ కార్డు) అందుబాటులో రాగా.. తెలంగాణలో మాత్రం సదరం ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. మార్చి 1 నుంచి మన రాష్ట్రంలో కూడా యూడీఐడీ కార్డుల విధానం అమలులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఈ కార్డు ఉంటేనే దివ్యాంగులకు పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న దివ్యాంగులు తప్పనిసరిగా యూడీఐడీ కార్డు వివరాలను తమ సర్వీస్ రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
నిర్ధారిత రంగుల్లో కార్డులు..
వికలత్వం శాతం ఆధారంగా నిర్ధారిత రంగుల్లో ఈ కార్డులను జారీ చేయనున్నారు. కార్డు ఒక్కసారి జారీచేస్తే మళ్లీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉండదు. బస్సులు, రైళ్లలో రాయితీతో పాటు దివ్యాంగులకు వర్తించే అన్ని సౌకర్యాలు యూడీఐడీ కార్డు ద్వారా పొందవచ్చు.
జిల్లాలో 13,680 మంది..
జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పింఛన్ పొందుతున్న దివ్యాంగులు సుమారు 13,600 మందికి పైగా ఉన్నారని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో వీరంతా వన్ నేషన్ వన్ డిసెబిలిటీ కింద యూడీఐడీ కార్డులు పొందాల్సి ఉంటుంది.
త్వరలో శాశ్వత గుర్తింపు కార్డుల
మంజూరుకు సన్నాహాలు
కార్డు ఆధారంగానే పింఛన్, సంక్షేమ పథకాల వర్తింపు
స్లాట్ బుకింగ్‌కు నెలాఖరు వరకు అవకాశం

దివ్యాంగులకూ గుర్తింపు

దివ్యాంగులకూ గుర్తింపు

దివ్యాంగులకూ గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment