
మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
సర్వశిక్ష అభియాన్
నిధులు ఖర్చు చేయాలి..
వనపర్తి: కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన పీఎంశ్రీ, సర్వశిక్ష అభియాన్ నిధులను వందశాతం ఖర్చుచేసి నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా పాఠశాలల్లో మౌలిక వసతులు, క్షేత్రస్థాయి పరిశీలనకు విడుదలైన నిధులు ఖర్చుచేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్ పంపాలన్నారు. అలాగే గ్రీన్ స్కూల్, ఆత్మరక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన, మౌలిక వసతులు, స్పోర్ట్స్, సైన్స్ బడ్జెట్ నిధుల వినియోగంపై సమీక్షించారు. నిధులు ఖర్చుచేసి నివేదిక ఇవ్వాలని, అపార్ నమోదు సైతం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘ నీ, మండల విద్యాధికారులు, పీఎంశ్రీ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట రూరల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం జిల్లాకు రానున్నారని.. పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి మంత్రులు భూమిపూజ చేయనున్నందున శుక్రవారం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. కార్యక్రమ స్థలంలో జిల్లా ఉద్యాన, వ్యవసాయశాఖకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆయిల్‌పాం సాగుచేస్తున్న ముగ్గురు ఆదర్శ రైతులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. వచ్చిన వారికి ఆహారం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ..
మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ శంకుస్థాపనకు శనివారం రాష్ట్ర మంత్రులు రానున్న సందర్భంగా శుక్రవారం భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షించారు. సభాస్థలి, వాహనాల పార్కింగ్ స్థలాలు, బందోబస్తు ఏర్పాట్ల తీరును పరిశీలించారు. బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన భద్రతపై పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, కొత్తకోట ఎస్‌ఐ ఆనంద్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి

మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment