పన్ను ఎగవేతదారులను గుర్తించండి
వనపర్తి: ఆదాయపు పన్ను ఎగవేత దారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను గుర్తించి.. ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు చేయడంపై గురువారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పన్ను ఎగవేత దారులను కట్టడి చేయాలంటే అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను గుర్తించడం కీలకమని అన్నారు. సీసీఎల్‌ఏ సూచన మేరకు తహసీల్దార్లు స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిపోర్టు చేయడంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రూ. 30లక్షలకు పైగా జరిగిన లావాదేవీలను గుర్తించి ఆదాయ పన్ను శాఖకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment