యూడీఐడీ కార్డు కోసం ఎప్పటి మాదిరిగానే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంపునకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీ–సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకొని నిర్దేశిత తేదీన సదరం శిభిరానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం దరఖాస్తుదారుడి వివరాలు, వికలత్వ శాతం వైద్యుల లాగిన్‌కు చేరుతుంది. వివరాలను పరిశీలించి అప్‌లోడ్ చేయగానే కార్డు మంజూరవుతుంది. జారీ చేసిన అధికారి డిజిటల్ సంతకంతో కార్డు ఉంటుంది. దాని ప్రకారమే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయనుంది.
నకిలీల ఆటకట్టు..
కేంద్రం తీసుకొచ్చిన యూడీఐడీ కార్డు విధానంతో ఇప్పటికే నకిలీ ధ్రువపత్రాలతో దివ్యాంగుల పింఛన్‌తో పాటు సంక్షేమ పథకాలు పొందిన వారిని గుర్తించి తొలగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అర్హులైన దివ్యాంగులకే సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో వీటిని పక్కాగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. గతంతో జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపునకు వెళ్లి అక్రమ మార్గంలో ధ్రువపత్రాలు పొందినవారు సైతం ప్రస్తుతం యూడీఐడీ కార్డు పొందాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment