
సాగునీటి కోతలు
●
రెండ్రోజులు సరికాదు..
యాసంగిలో జూరాల ఎడమకాల్వ ద్వారా రామన్‌పాడు వరకు మాత్రమే నీటిని అందిస్తామని అధికారులు ప్రకటించారు. అమరచింత ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు వదులుతుండటంతో 4 ఎకరాల్లో వరి సాగుచేశా. వారబందీ విధానంలో 5 రోజులు సాగునీరు వదులుతున్నా పంటలకు సరిపడా అందక ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది ఇకపై వారంలో రెండు రోజులు మాత్రమే అందిస్తామని చెప్పడం సరికాదు.
– వెంకట్‌రెడ్డి, రైతు, అమరచింత
అమరచింత: జూరాల జలాశయం ఆయకట్టుకు యాసంగిలో వారబందీ విధానంలో అధికారులు సాగునీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతుండటంతో ఇక నుంచి వారంలో రెండ్రోజులే సాగునీరు వదలాలని నిర్ణయించారు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తగినంత లేదని ఈసారి యాసంగి సాగు ఆయకట్టును 34,246 ఎకరాలకు కుదించిన విషయం తెలిసిందే. ఎడమ కాల్వ విభాగంలో రామన్‌పాడు రిజర్వాయర్ వరకు ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించడంతో పాటు ఆయా ప్రాంతాల రైతులకు సైతం సాగు ప్రారంభంలోనే అవగాహన కల్పించారు. గతేడాది కూడా యాసంగిలో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈసారి వానాకాలంలో ఎగువ నుంచి తగినంత వరద వచ్చినా ప్రాజెక్టులో ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోకపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారంలో రెండ్రోజులే..
జూరాల ఆయకట్టుకు వారంలో రెండ్రోజులే నీటిని అందించేందుకు సిద్ధమయ్యారు. మంగళ, బుధవారం నీటిని సరఫరా చేసి మిగిలిన రోజులు నిలిపివేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు. గతంలో వారబందీ విధానంలో వారంలో 4 రోజులు సాగునీటిని అందించి, మూడు రోజులు నిలిపివేసేవారని.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇటు పంటలకు, అటు తాగునీటి కష్టాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
జూరాల ఆయకట్టుకు వారంలో రెండ్రోజులే నీటి సరఫరా
ఉన్నతాధికారుల
ఆదేశాల మేరకు..
జూరాల జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుంది. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగొద్దనే ఇకపై వారంలో రెండ్రోజులు మాత్రమే సాగునీటిని వదలాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ విషయాన్ని కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు రైతులకు తెలియజేయాలని సంబంధిత ఏఈలకు వివరించాం. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.256 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రభుత్వం ముందుచూపుతో సాగునీటిని పొదుపుగా ఇవ్వాలని నిర్ణయించింది.
– జుబేర్ అహ్మద్, ఈఈ, జూరాల ప్రాజెక్టు, గద్వాల డివిజన్
ప్రాజెక్టులో 5.256 టీఎంసీలు..
ప్రస్తుత యాసంగిలో జూరాల జలాశయం ప్రధాన కుడి కాల్వ కింద సుమారు 15 వేల ఎకరాలు, ప్రధాన ఎడమ కాల్వల కింద రామన్‌పాడు జలాశయం వరకు సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. ఇందుకుగాను 4.93 టీఎంసీల నీటిని కేటాయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.256 టీఎంసీల నీరు ఉండగా.. ఇందులో 2.593 టీఎంసీలను వేసవిలో తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు కేటాయించారు. తాగు, సాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ముందస్తుగా వారబందీని అమలు చేస్తూ వచ్చారు.
రైతులను ఆగం చేయడమే..
అమరచింత ఎత్తిపోతల పథకం కింద ఐదు ఎకరాల్లో వరి సాగుచేశా. ఎత్తిపోతలకు జూరాల నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. వారంలో 5 రోజులు నీటిని అందిస్తున్నా పుష్కలంగా అందడం లేదని దిగాలుతో ఉన్నాం. అలాంటిది 2 రోజులు మాత్రమే వదలడమంటే రైతులను ఆగం చేయడమే.
– శ్రీనివాస్‌రెడ్డి, రైతు, అమరచింత
అసలే వారబందీ.. ఆపై కుదింపు
యాసంగి సాగుకు తప్పని కష్టాలు
ఆందోళనలో ఆయకట్టు రైతులు

సాగునీటి కోతలు

సాగునీటి కోతలు

సాగునీటి కోతలు

సాగునీటి కోతలు

సాగునీటి కోతలు
Comments
Please login to add a commentAdd a comment