మక్తల్: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం.. ఒక దృఢ సంకల్పతో ముందుకు సాగుతూ.. ఏ ఒక్కరినీ జోగినిగా మార్చకుండా అడ్డుకోవడంతో పాటు ఆదర్శ వివాహాలు జరిపిస్తూ.. జోగినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఊట్కూరుకు చెందిన దళిత మహిళ హాజమ్మ. చిన్నతనం నుంచే జోగిని వ్యవస్థను వ్యతిరేకించిన ఆమె.. ఓఎంఐఎఫ్, ఏహెచ్‌టీయూ సంస్థల సహకారంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగినులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆశ్రయ్ సంస్థ నిర్వాహకురాలు గ్రీస్ నిర్మలతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు హాజమ్మ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా జోగిని వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది జోగినులకు వివాహాలు జరిపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల మంది జోగినులు ఉన్నారని.. అందులో 2 వేల మందికి ప్రభుత్వం నేటికీ పునరావాసం కల్పించలేదని హాజమ్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment