
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ రావుల గిరిధర్, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. బహిరంగ సభకు వచ్చే ప్రముఖులు, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment