పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో ఆస్తి, కొళాయి పన్ను వసూళ్లను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని.. వేగంగా లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జంగిడిపురం ప్రాంతంలో పర్యటించి పుర సిబ్బంది పన్ను వసూలు తీరును పరిశీలించారు. అనంతరం పుర కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చి పన్నులు వసూలు అయ్యేలా చూడాలని సూచించారు. బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఉదయం 7 గంటలకు కార్యాలయంలో హాజరు వేసి క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లు ప్రారంభించాలన్నారు. సిబ్బంది వద్ద తప్పనిసరిగా అత్యధిక బకాయిలు ఉన్న వారి జాబితా ఉండాలని.. డబ్బులు ఎలా తీసుకోవాలనే విషయంపై వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బకాయిదారులకు నోటీసులు పోస్ట్, ఇళ్లకు వెళ్లినప్పుడు అందజేయాలన్నారు. అలాగే స్మార్ట్‌ఫోన్ నుంచి సందేశాలు పంపించాలని సూచించారు. అన్ని బ్లాక్‌లలో పన్ను వసుళ్ల కోసం ప్రత్యేక శిభిరాలు కూడా ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. నల్లచెరువు సుందరీకరణ, అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచి గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర పుర సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment