
దివ్యాంగులు యూడీ ఐడీ కలిగి ఉండాలి
వనపర్తి: దివ్యాంగులందరూ యూడీఐడీ (యూనిక్ డిజేబుల్ ఐడి) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అనంతం సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. యూడీఐడీ దరఖాస్తుల నమోదుపై మీ–సేవ కేంద్రాల నిర్వాహకులు, పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలు, సీసీలు, ఎంపీడీఓలు, ఏడీఎంలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రుల్లో వికలత్వం నిర్ధారణకు అవసరమైన వైద్యులు, పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, శిబిరాల్లో దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆస్పత్రుల్లో స్లాట్ బుకింగ్ చేసి సమాచారం ఇవ్వాలని, నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూడీఐడీ కార్డు ఇవ్వాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమాధికారి సుధారాణి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సైన్స్‌మేళాలు దోహదం
వనపర్తి రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందేందుకు, భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు సైన్స్ మేళాలు దోహదపడుతాయని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. శనివారం మండలంలోని చిట్యాల శివారు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ పాఠశాలల జిల్లాస్థాయి సైన్స్‌మేళా, గణితమేళాను ఆయన ప్రారంభించారు. జిల్లాలోని 15 పాఠశాలల విద్యార్థులు పాల్గొని గణితం, సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. ఏఎంఓ మహానంది, జిల్లా ప్లానింగ్ కో–ఆర్డినేటర్ శేఖర్, ఎస్‌ఓ యుగంఘంర్, జీసీడీఓ శుభలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్స్‌పాల్ గురువయ్యగౌడ్, డిగ్రీ కళాశాల అధ్యాపకులు దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్, ఆర్పీ బలరాముడు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలను తిలకరించారు. పాఠశాల చైర్మన్ రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దివ్యాంగులు యూడీ ఐడీ కలిగి ఉండాలి
Comments
Please login to add a commentAdd a comment