
22న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రాక
ఖిల్లాఘనపురం: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 22న మండలానికి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట మండలాలకు దూరమవుతున్నందున రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి కోరిక మేరకు పెద్దమందడి, ఖిల్లాఘనపురం రెండు మండలాలకు కలిపి మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. షాపురం గ్రామానికి వెళ్లే కూడలి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో మార్కెట్‌యార్డు ఏర్పాటుకు మంత్రి భూమిపూజ చేస్తారని వివరించారు. అలాగే గోపాల్‌పేటలో కూడా మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మండలానికి వ్యవసాయ మార్కెట్‌యార్డును మంజూరు చేసినందుగాను పలువురు నాయకులు, రైతులు, వ్యాపారులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు.
ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ..
కొత్తకోట: మండలంలోని సంకిరెడ్డిపల్లిలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఈ నెల 22న మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి భూమిపూజ చేయనున్నట్లు సీడీసీ చైర్మన్ గొల్లబాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment