
లోక్‌అదాలత్‌లో 6,266 కేసులు పరిష్కారం
వనపర్తిటౌన్: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు చెప్పారు. ఏడు బెంచ్‌ల ద్వారా 2,663 క్రిమినల్, 8 సివిల్, 3,595 ప్రీ లిటిగేషన్ కేసులతో కలిపి మొత్తం 6,266 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్‌అదాలత్ గొప్ప అవకాశమన్నారు. కక్షిదారులు సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు కోర్టు ఫీజు వాపస్ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి బి. రవికుమార్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి జానకి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి బి. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా చెస్ పోటీలు
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో శనివారం జూనియర్, సీనియర్స్ విభాగాల్లో చెస్ పోటీలు నిర్వహించారు. ముందుగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, కార్యదర్శి వేణుగోపాల్, ఆర్థిక కార్యదర్శి టీపీ కృష్ణయ్య పోటీలను ప్రారంభించగా.. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో పి.కృతిక, వైష్ణవి, సీనియర్స్ విభాగంలో ఎం.వేణుగోపాల్, పి.మోహన్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ప్రతినెలా రెండో శనివారం, ఆదివారం చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
సీఎంను కలిసిన పీయూ వీసీ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పీయూకు మంజూరైన ఇంజినీరింగ్, లా కళాశాలలను త్వరలో ప్రారంభించాల్సి ఉందని, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేయాలని వీసీ ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. పీయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు, అదనపు పోస్టుల మంజూరు, వనపర్తి పీజీ సెంటర్‌లో బాలుర, బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు.
రేపు అప్రెంటిస్‌షిప్ మేళా
వనపర్తి విద్యావిభాగం: జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ఈ నెల 10న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కె.రమేస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పలు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు http://www.appr enticeshipindia.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు మహ్మద్ ఇస్తేముల్ హక్ 98492 44030 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

లోక్‌అదాలత్‌లో 6,266 కేసులు పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment