
పాలమూరు రుణం తీర్చుకుంటా
కేసీఆర్ వల్లే కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం
● పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో
ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు
● మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు
● ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే సహించను
● వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి
కార్పొరేషన్ల వ్యవస్థ మళ్లీ బలోపేతం
ఎీస్స, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పదేళ్ల పాలనలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు కార్పొరేషన్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లుకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14,870 కోట్లను రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించిందన్నారు. సన్న రకాలు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో రూ.1804 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసం, ప్రజాభివృద్ధి కోసం ఉపయోగిస్తామని వెల్లడించారు.
● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు.
●
● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్‌మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ●
వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు.
ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
● వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో చాలా సంక్షేమ హాస్టల్లో ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయని.. వాటికి పక్కా భవనాల నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా సీఎంను కోరారు. జిల్లాలో నూతనంగా నిర్మించనున్న 500 పడకల ఆస్పత్రికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్య పేరు పెట్టాలని, రాజమహల్ మరమ్మతులు చేసేందుకు అనుమతిచ్చి.. కావాల్సిన నిధులు మంజూరు చేయాలని, వనపర్తి నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు.
పాలమూరు వాసులు అమాయకులేం కాదు..

పాలమూరు రుణం తీర్చుకుంటా

పాలమూరు రుణం తీర్చుకుంటా

పాలమూరు రుణం తీర్చుకుంటా

పాలమూరు రుణం తీర్చుకుంటా

పాలమూరు రుణం తీర్చుకుంటా
Comments
Please login to add a commentAdd a comment