
మందకొడిగా ఆస్తిపన్ను వసూలు
బహిరంగ సభకు హాజరైన ప్రజలు
జిల్లాలో మండలాల వారీగా
ఆస్తిపన్ను వసూలు లక్ష్యం ఇలా.. (రూ.లలో)
మండలం గ్రామాలు లక్ష్యం వసూలు శాతం
వనపర్తి 26 19,58,306 16,44,577 83.98
ఆత్మకూర్ 13 13,70,596 10,78,976 72.00
పెబ్బేరు 20 30,10,606 13,47,837 44.77
వీపనగండ్ల 14 14,05,306 10,85,228 77.27
మదనాపూర్ 17 19,55,803 7,31,0030 37.38
అమరచింత 14 10,46,667 6.62,871 63.33
గోపాల్‌పేట 15 21,72,579 10,12678 46.61
రేవల్లి 12 08,38,766 5,58,544 66.59
ఖిల్లాఘనపూర్ 27 29,12,286 22,91,747 78.69
శ్రీరంగాపూర్ 8 08,52,461 5,74,616 65.82
పాన్‌గల్ 28 24,14,567 22,39,428 92.75
చిన్నంబావి 17 14,49,673 13,33,306 91.97
కొత్తకోట 22 26,12,637 23,28,643 89.13
పెద్దమందడి 22 16,36,701 11,10231 67.83
● గ్రామపంచాయతీల్లో ఇప్పటి వరకు 70శాతం మాత్రమే రాబడి
● ముంచుకొస్తున్న గడువు
● లక్ష్యాన్ని చేరుకుంటామంటున్న అధికారులు
ఆత్మకూర్: గ్రామపంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు పన్నులే. ఇలాంటి పన్నుల వసూలులో పురోగతి కనిపించడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం 28 రోజుల వ్యవధి మాత్రమే ఉండగా.. జిల్లాలోని 14 మండలాల్లో పన్ను వసూలు మందకొడిగా సాగుతోంది. ప్రస్తుతం వేగవంతంగా పన్ను రాబడితేనే లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం రూ. 2.41 కోట్ల పన్ను వసూలుచేసి వందశాతం పూర్తిచేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,56,57,445 పన్ను లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ. 1,79,99,712 మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ. 1,95,67,051 పన్ను వసూలు కావాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా జీపీలకు 70 శాతం మాత్రమే పన్ను రాబడి వచ్చింది. ఈ నెలాఖరు నాటికి వందశాతం పన్ను వసూలు చేసి.. లక్ష్యాన్ని చేరుకుంటామని సంబందిత అధికారులు అంటున్నారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలోనే పన్ను వసూలుపై అధికారులు హడావుడి చేస్తున్నారని పలువురు చెబుతున్నారు.
వేగవంతం చేశాం..
జిల్లాలోని అన్ని జీపీల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఆస్తిపన్ను వసూలును వేగవంతం చేశాం. ఈ విషయమై మండలాల వారీగా పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల రెండో వారంలోనే వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– సురేష్, డీపీఓ

మందకొడిగా ఆస్తిపన్ను వసూలు
Comments
Please login to add a commentAdd a comment