
పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించండి
ఆత్మకూర్: పట్టణ ప్రజలు సకాలంలో పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. బుధవారం స్థానిక పుర కార్యాలయంలో అధికారులు, వార్డు ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూలు లక్ష్యం రూ.2.23 కోట్లుకాగా.. ఇప్పటి వరకు రూ.1.13 కోట్లు వసూలయ్యాయని, సుమారు రూ.1.10 కోట్లు బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మూడు వేలకు పైగా దరఖాస్తులు రిజిస్ట్రేషన్ కాగా.. కేవలం పది మంది మాత్రమే రుసుం చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ, పన్ను వసూళ్లపై ఇల్లిల్లూ తిరిగి అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీపాద్, పుర కమిషనర్ శశిధర్, సబ్ రిజిస్ట్రార్ ప్రకాశ్ ఉన్నారు.