
కొత్తకోట, పెబ్బేరులో అసంపూర్తిగా..
కొత్తకోటతో పాటు పెబ్బేరులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డుల నిర్మాణాలు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. కొత్తకోటలో పాత ఆర్‌అండ్‌బీ అతిథిగృహం స్థానంలో పనులు ప్రారంభించినా నేటికీ పూర్తి కాలేదు. 2022లో అప్పటి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు నిర్మాణానికి రూ.2.20 కోట్లు మంజూరు చేసింది. అప్పటి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మొదట్లో పనులు వేగంగా జరిగినప్పటికి రెండేళ్లుగా పూర్తిగా ఆగిపోయాయి. దీంతో కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు రోడ్డు పక్కనే కొనసాగుతున్నాయి. వారాంతపు సంత సైతం ప్రవేట్ స్థలంలో కొనసాగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వం చొరవ చూపాలి..
గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు పనులు ప్రారంభించినప్పటికీ అదే ప్రభుత్వ పాలనలో పనులు ఆగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించాలి. పట్టణంలో చేపలు, మాంసం, కూరగాయలు ఒక్కో ప్రాంతంలో విక్రయిస్తుండటంతో పుర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు నిర్మాణం పూర్తయితే అన్ని ఒకేచోట లభిస్తాయి. – చీర్ల నాగన్నసాగర్, మాజీ కౌన్సిలర్, కొత్తకోట
●

కొత్తకోట, పెబ్బేరులో అసంపూర్తిగా..