
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం ఉదయం 8.15కు జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఎస్, డీఓలకు సూచనలు చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాల, పెద్దమందడి, ఖిల్లాఘనపురం పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బుధవారం పరీక్షకు 5,987 మంది విద్యార్థులకుగాను 5,837 మంది హాజరుకాగా.. 150 మంది గైర్హాజరైనట్లు చెప్పారు.