
వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక పాలనలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపధ్యంలో ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) విధి నిర్వహణకు అడ్డుతగిలితే డెమొక్రాట్ జోహ్రాన్ మమ్దానీని అరెస్టు చేస్తామని ట్రంప్ సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది.
దీనిపై భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు తాను తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. మమ్దానీ అధికారికంగా న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. రాబోయే నవంబర్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొననున్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థిగా ధృవీకరణ జరిగిన వెంటనే ఆయన ట్రంప్ తీరుపై మండిపడ్డారు. ఒక ప్రకటనలో అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులను పట్టించుకోనని స్పష్టం చేశారు.
My statement on Donald Trump's threat to deport me and his praise for Eric Adams, who the President "helped out" of legal accountability. https://t.co/m7pNcT2DFS pic.twitter.com/UcYakMx4lI
— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 1, 2025
యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు తనను అరెస్టు చేస్తానని, తన పౌరసత్వాన్ని తొలగించి, నిర్బంధ శిబిరంలో ఉంచుతానని హెచ్చరించారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిని సూచిస్తున్నాయన ఆరోపించారు. 2021లో డెమొక్రాట్‌గా ఎన్నికైన ఆడమ్స్‌ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదని, అది మేయర్ ఆడమ్స్ పదవీకాలానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తుందని అన్నారు.
దక్షిణాసియాలోని ఉగాండాలో జన్మించిన జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యునిగా ఉన్నారు. ఆయన నవంబర్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే, ఈ నగరానికి తొలి ముస్లిం మేయర్ కానున్నారు. కాగా మమ్దానీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని పలువురు రిపబ్లికన్లు అధ్యక్షుడు ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఆయన ఇటీవలే అంటే.. 2018లోనే అమెరికా పౌరసత్వం పొందారని అంటున్నారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే..