వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో రిగ్గింగ్, కుట్ర అభియోగాలపై ట్రంప్‌ను అరెస్ట్ చేశారు. భారీ భద్రత మధ్య ట్రంప్ అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు వద్ద లొంగిపోయారు.
వివరాల ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రంలో ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. కాగా, ట్రంప్‌పై 13 రకాల అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది. ఈ క్రమంలో గురువారం(భారత కాలమానం ప్రకారం శుక్రవారం) జార్జియా జైల్ వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే, ఇప్పటికే ఆయన స్వయంగా ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్ని ఫాని విల్లీస్ అనుమతించారు. దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు.
కాగా, ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి. ట్రంప్ జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా దాన్ని అరెస్ట్ కిందే పరిగణిస్తారు. కొన్ని రోజుల కిందట కూడా 2020 ఎన్నికలకు సంబంధించిన కేసులోనే ట్రంప్ అరెస్టయ్యారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ వెల్లడించారు.
బెయిల్ పొందిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇది నిజంగా అమెరికాకు విచారకరమైన రోజు. ఇది ఎప్పటికీ జరగకూడదు అంటూ కామెంట్స్ చేశారు.
🚨 BREAKING: Donald Trump speaks after arrest: “This is a really sad day for America — It should never happen.”
— Benny Johnson (@bennyjohnson) August 25, 2023
pic.twitter.com/Tc8rRDfMCb
ఇది కూడా చదవండి: యెవ్‌గెనీ ప్రిగోజిన్ మృతిపై బైడెన్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment