
టాలీవుడ్‌లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. లెజెండ్ సినిమా తర్వాత పూర్తి స్థాయి విలన్‌గా మారిపోయారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ప్రభాస్ సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రతో అభిమానులను మెప్పించారు. అంతే కాకుండా కన్నడ మూవీ కాటేరాలో సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2లో జగ్గు భాయ్ నటిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అలరిస్తున్నారు. తాజాగా జగపతిబాబు ఓ వీడియోను తన ట్విటర్‌లో పంచుకున్నారు. లెజెండ్ తర్వాత తన కెరీర్‌లో వచ్చిన మార్పులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
జగపతి బాబు మాట్లాడుతూ..' నాకు చిన్న సినిమాలు చేయాలని కోరిక ఉంది. కమిటేడ్‌గా చేస్తున్నారు. కొత్తగా ఉంటున్నాయి సినిమాలు. ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే.. నేను డబ్బున్న పేదవాడిని. నా చేతిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఓకే. కానీ ఆ సినిమాల షూటింగ్స్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. ఆ సినిమాలు చేతిలో ఉన్నాయి కదా అని.. వేరే అవకాశాలు రావడం లేదు. కానీ మరోపక్క.. అమ్మో జగపతిబాబు పెద్ద సినిమాలు చేస్తున్నారు. చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని అనుకుంటున్నారని' అని చెప్పారు.
'కానీ పెద్ద సినిమాల వాయిదాల వల్ల నాకున్న చిత్రాల్లో అవకాశాలు రావడం లేదు. దీంతో అటు.. ఇటు కాకుండా అయిపోయా. గతంలో రెండు, మూడుసార్లు నా పని అయిపోయిందని ఓ స్టేజీలో నేనే అనుకున్నా. అది కూడా లెజెండ్ సినిమాకు రెండు నెలల ముందు. కానీ మళ్లీ వచ్చాను. మీ జగపతిబాబు ఎక్కడికీ పోడు. వెళ్లినట్లు వెళ్తాను.. కానీ మళ్లీ వస్తూనే ఉంటాను.' అంటూ వీడియోను రిలీజ్ చేశారు. అంతే కాకుండా లెజెండ్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చారు. కాగా.. జగపతిబాబు ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Dabbunna Pedhavadini…..
Inko #Legend kosam Eduruchustuna. pic.twitter.com/C1GzB8RXrR— Jaggu Bhai (@IamJagguBhai) April 2, 2024
Comments
Please login to add a commentAdd a comment