ఆర్జీవీ ఫేవరేట్‌ భామ.. మరో క్రేజీ వీడియో షేర్ చేసిన డైరెక్టర్! | Ram Gopal Varma Shares A video Of His Movie Actress Goes Viral | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఆర్జీవీ ఫేవరేట్‌ ముద్దుగుమ్మ.. మరో వీడియోతో మతి పొగోడుతున్న భామ!

Published Mon, Jan 29 2024 2:47 PM | Last Updated on Mon, Jan 29 2024 3:59 PM

Ram Gopal Varma Shares A video Of His Movie Actress Goes Viral - Sakshi

టాలీవుడ్ సంచలన డైరెక్టర్‌ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వ్యూహం. ఈ చిత్రంలో అజ్మ‌ల్, మాన‌స ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించగా..  దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందు వల్ల మరింత ఆలస్యమవుతోంది.

ఇదిలా ఉండగా..  గతంలో ఆర్జీవీ ఓ అమ్మాయి వీడియోను షేర్ చేశారు. ఆ అమ్మాయి చేతుల్లో కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తూ కనిపించింది. ఆ తర్వాత తన గురించి వివరాలు తెలిస్తే చెప్పండంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. అంతే కాకుండా ఆ అమ్మాయితో ఏకంగా సినిమాను కూడా ప్రకటించి షాకిచ్చారు ఆర్జీవీ.

తాజాగా ఆ అమ్మాయి చేసిన మరో వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు రాంగోపాల్ వర్మ. ఆ వీడియోతో అభిమానులకు ఓ ఆసక్తికర ప్రశ్న సంధించారు ఆర్జీవీ. ఆమె సంగీతం వింటోందా? లేదా సంగీతమే ఆమె నుంచి వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement