
ముంబయి : బాలీవుడ్‌లో ఎక్కువగా వదంతులు, ఊహాగానాలు తమ చుట్టూ తిప్పుకుంటున్న జంట అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా. చాలా రహస్యంగా తమ బంధాన్ని కొనసాగిస్తున్న వీరిద్దరు ఇటీవలె బ్రేకప్ చెప్పేసుకున్నారని, విడిపోయారని వార్తలు బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే, ఆ వార్తలన్నీ కూడా ఒట్టి అబద్ధాలేనని, తాము కలిసే ఉన్నామని చెప్పేలా ఇప్పుడు కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
దీపావళి సందర్భంగా ఏక్తాకపూర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చక్కగా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ చాలా అన్యోన్యంగా దర్శనం ఇచ్చారు. ఇద్దరు కలిసి ఏక్తాకపూర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరు విడిపోయినట్లు కాకుండా మునుపటికంటే మరింత దగ్గరైనట్లు కనిపించారు. గార్జియస్ లుక్‌లో కనిపించినా అలియా నవ్వుతూ సిద్ధార్థ్‌తో తెగ కబుర్లు చెబుతూ కనిపించింది. దీంతో మీడియా వర్గాలంతా ఆశ్చర్యపోయారు. వారిద్దరు విడిపోలేదని, కలిసే ఉన్నారని, అందుకు ఇవిగో సాక్ష్యాలు అంటూ పలు ఫొటోలు పంచుకున్నారు.