
సిద్ధార్థ ప్రపోజల్‌కు ప్రియాంక ఓకే చెప్పేసింది
ముంబయి: బాలీవుడ్ నటి, హాలీవుడ్‌లో సైతం హల్‌చల్ చేసిన ప్రియాంక చోప్రా మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఏక్ విలన్‌తో మంచి పేరు తెచ్చుకున్న సిద్ధార్థ మల్హోత్రాకు ఓకే చెప్పింది. అతడు పెళ్లి ప్రపోజల్ చేయగానే నవ్వులు చిందిస్తూ ఒప్పేసుకుంది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఆమె ఓకే చెప్పింది పెళ్లికే గానీ, నిజ జీవితంలో పెళ్లికి కాదు. నిరవ్ మోడీ ఆభరణాలకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలో భాగంగా వారు ఈ దృశ్యంలో కలిసి నటించారు. ఇంకెప్పుడు ఎవరికీ ఎస్ అని చెప్పకూడదనుకున్న ఒకమ్మాయి.. తనను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్న ఓ అబ్బాయి నిరవ్ బ్రాండ్‌కు చెందిన ఉంగరం తీసుకొచ్చి ఇవ్వగానే వెంటనే ఎస్ అని చెప్పేసే సీన్‌లో వారు నటించారు.
ఈ ప్రకటన అందరినీ ఆకట్టుకుంటోంది. నిరవ్ మోడీ జ్యువెలర్స్ ఎప్పటికీ నో చెప్పలేరు అంటూ యాడ్ ముగుస్తుంది. ఇప్పుడు ఈ యాడ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద హల్‌చల్ అయింది. బాలీవుడ్ వర్గాలు అప్పుడే గుసగుసలతో వండి వార్చేస్తున్నారు. దీనికి ఫన్నీగా సిద్ధార్థ స్పందిస్తూ ప్రియాంక.. ‘అందరూ నువ్వు నా ప్రపోజల్‌కు ఎస్ చెప్పావని చర్చించుకుంటున్నారు.. సంతోషంగా ఉంది కదా’. అని ట్విట్టర్లో ప్రశ్నించగా.. ‘నీ గురించి కాదుగానీ, నా గురించి నా ఉంగరం గురించి అందరూ మాట్లాడుతున్నారు’ అంటూ మరో ట్వీట్‌ను ప్రియాంక బదులుగా ట్వీటింది. ఈ సరదా సంభాషణ నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది.