
అందరూ ఒకేలా ఉండరు. బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు తమ పర్సనల్ లైఫ్ గురించి అభిమానులతో చెప్పుకునేందుకు ఎల్లప్పుడూ రెడీ ఉంటారు. మరికొందరు మాత్రం వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచేందుకే సుముఖత చూపుతారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రెండో రకానికి చెందుతుంది. సహ నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఏడాది నుంచి వార్తలు వినిపిస్తునే ఉన్నాయి, కానీ ఆమె దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో గత నెలాఖరున బాంద్రాలోని సిద్ధార్థ్ నివాసానికి వెళ్తూ కియారా కెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది.
కానీ ఈసారి కియారా ఏకంగా ప్రియుడిని వెంటేసుకుని నిర్మాత కరణ్ జోహార్ ఇంటికి వెళ్లింది. ఆదివారం కరణ్ తన కవలలు యశ్, రూహిల బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పుట్టినరోజు వేడుకలకు లవ్ బర్డ్స్‌కు ఆహ్వానం అందడంతో వీరు జంటగా కలిసి వచ్చారు. పార్టీ అనంతరం రాత్రి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వీరితో పాటు కరీనా కపూర్, గౌరీ ఖాన్, రాణీ ముఖర్జీ, నేహా ధూపియా సహా పలువురు సెలబ్రిటీలు సైతం కరణ్ ఇంట్లోని వేడుకకు హాజరై సందడి చేశారు. ఇదిలా వుంటే కియారా, సిద్ధార్థ్ ఇద్దరూ 'షేర్షా' సినిమాలో కలిసి నటించారు. దీనికి విష్ణువర్దన్ దర్శకత్వం వహించగా కరణ్‌జోహార్ సహనిర్మాతగా వ్యవహరించాడు.
చదవండి: బాయ్‌ఫ్రెండ్ ఇంటికి హీరోయిన్!
Comments
Please login to add a commentAdd a comment