హీరోయిన్‌ను ఎత్తేశాడు | Sidharth embarrass Rakul during Aiyaary promotions | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 16 2018 1:03 PM | Last Updated on Sat, Feb 17 2018 5:21 PM

Sidharth embarrass Rakul during Aiyaary promotions - Sakshi

రకుల్‌ను ఎత్తేసిన సిధార్థ్‌ ఫోటోలు

సాక్షి, సినిమా : బాలీవుడ్‌లో అయ్యారీ సినిమా నేడు రిలీజ్‌ అయ్యింది. నాలుగేళ్ల తర్వాత రకుల్‌ ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం గనుక హిట్‌ అయితే మళ్లీ పాగా వేయొచ్చన్నది ఈ బ్యూటీ ప్లాన్‌. అందుకే చిత్ర ఫలితం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్‌ సమయంలో చోటు చేసుకున్న ఓ ఘటన వైరల్‌ అవుతోంది.

ఈ చిత్ర హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి రకుల్ ప్రమోషన్‌లలో పాల్గొంది. ఢిల్లీలోని ఎస్ ఆర్ సీసీ కళాశాలకు ఇటీవల వీళ్లిద్దరూ వెళ్లిన సందర్భంలో తమాషా ఘటన జరిగింది. అక్కడి విద్యార్థులు ఈ జంటను డాన్స్‌ చేయాల్సిందిగా కోరారు. దీంతో ఈ చిత్రంలోని ‘లేయ్ డూబా’ అనే పాటకు డ్యాన్స్ సిద్ధార్థ్-రకుల్ డ్యాన్స్ చేశారు. 

ఈ క్రమంలో రకుల్ ని సిద్ధార్థ్ అమాంతం ఎత్తుకోవటంతో విద్యార్థులంతా కేకలు వేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో  చక్కర్లు కొడుతోంది.

Sidharth 😍😍😍😍✌

A post shared by HARAYANA HP RJ PB DL shootout (@selfie__stan) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement