
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం. ఆమె పేరు వినిపిస్తే చాలు ఏ వివాదానికి తెరలేపిందా! అని అంతా ఆశ్చర్యపోతుంటారు. ఇక ఆమె మాట్లాడితే బాలీవుడ్ స్టార్ కిడ్స్, నెపోటిజంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు బి-టౌన్ సెలబ్రెటీలపై ఆరోపణలు చేస్తూ వారిని విమర్శిస్తూ ఉంటుంది కంగనా.
చదవండి: సుమంత్‌తో విడాకుల అనంతరం నటనకు బ్రేక్ ఇచ్చిన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
అలాంటి కంగనా తాజాగా కొత్త జంట కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల డేటింగ్, పెళ్లిపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఆమె స్పందన చూసి కొందరు సర్‌ప్రైజ్ అవుతున్నారు. కాగా కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాలు మంగళవారం(ఫిబ్రవరి 7న) ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. కొంతకాలం సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ వార్త బయటకు రావడంతో ఓ ట్విటర్ యూజర్ అయితే వీరు డేటింగ్‌లో ఉంది నిజమేనా? అని ట్వీట్ చేశాడు.
చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరో తెలుసా?
దీనికి కంగానా ఆసక్తికర రీతిలో స్పందించింది. ‘అవును వారు డేటింగ్‌లో ఉన్నారు. కానీ బ్రాండ్ల కోసం, సినిమాల ప్రమోషన్ల కోసం కాదు. ఈ జంట లైమ్ టైట్లో ఉండేందుకు, ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ఎప్పడు ప్రయత్నించలేదు. చాలా చిత్తశుద్ధితో, నిజమైన ప్రేమ కలిగిన చూడముచ్చటైన జంట వీరిద్దరిది’ అని కంగనా రనౌత్ బదులిచ్చింది. కియారా, సిద్ధార్థ్ జంటను గతంలోనూ కంగనా పలు సందర్భాల్లో ప్రశంసించిన సంగతి తెలిసిందే. ‘ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉంది.. సినిమా పరిశ్రమలో నిజమైన ప్రేమను అరుదుగా చూస్తుంటాం. వీరిద్దరూ కలసి చూడ్డానికి దేవతల మాదిరిగా ఉన్నారు’’ అని కియారా, సిద్ధార్థ్ వివాహానికి ముందు కంగనా రనౌత్ ట్వీట్ చేయడం గమనార్హం.
They were dating? pic.twitter.com/msnnsYKSHu
— Aniruddha Guha (@AniGuha) February 7, 2023
Comments
Please login to add a commentAdd a comment