ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న రష్మిక మందన్నా! | Rashmika Mandanna Bollywood Future Depends On Mission Majnu | Sakshi
Sakshi News home page

ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న రష్మిక మందన్నా!

Jan 7 2023 6:07 PM | Updated on Jan 7 2023 6:09 PM

Rashmika Mandanna Bollywood Future Depends On Mission Majnu - Sakshi

సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా జంటగా నటించిన 'మిషన్ మజ్ను'.  పీరియాడిక్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్‌లో డెబ్యూ ఇవ్వనుంది. శాంతను భగ్చీ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 20న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే  టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

దాదాపు నిమిషమున్నర నిడివితో కట్ చేసిన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య 1971 నేపధ్యంలో జరిగిన యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపైనే రష్మిక అన్ని ఆశలు పెట్టుకుంది.

ఈ సినిమా సక్సెస్‌ అయితే హిందీలో వరుస ఛాన్సులు దక్కించుకోనుంది. మరి మిషన్ మజ్నుతో  నేషనల్‌ క్రష్‌ బీటౌన్‌ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement