![Sidharth Malhotra, Kiara Advani Look Married in Unseen Video Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/7/kiara-advani.gif.webp?itok=W2nF0l-n)
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే! తరచూ డిన్నర్ పార్టీలని, హాలీడే ట్రిప్‌లని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తాము లవ్‌లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా సిద్దార్థ్, కియారా ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు.
ఇందులో ప్రేమ పక్షులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు. అయితే అన్‌సీన్ వీడియోలో కియారా తన ప్రియుడి కళ్లల్లో నలక పడితే తీసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సిద్ అంటే ఎంత ప్రేమో, వీరిని చూస్తుంటే ఆల్‌రెడీ పెళ్లైన జంటలాగే ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment