కత్రినా తత్వమే అంత అంటున్న హీరో | Katrina takes her work very seriously, says Sidharth Malhotra | Sakshi
Sakshi News home page

కత్రినా తత్వమే అంత అంటున్న హీరో

Jul 8 2016 2:49 PM | Updated on Apr 3 2019 6:34 PM

కత్రినా తత్వమే అంత అంటున్న హీరో - Sakshi

కత్రినా తత్వమే అంత అంటున్న హీరో

కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి కత్రినాకైఫ్ పై యంగ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.

న్యూఢిల్లీ: కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి కత్రినాకైఫ్ పై యంగ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. 'బార్ బార్ దేకో' మూవీలో ఈ ఇద్దరూ జోడీకట్టి రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కత్రినా పనిపై చాలా శ్రద్ధ కనబరుస్తుందని, తన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేసేందుకు కృషిచేస్తుందన్నాడు. తన క్యారెక్టర్లో ఒదిగిపోయి అచ్చం అలాగే ప్రవర్తిస్తుందని, తెరపై కత్రినా కాదు ఆమె క్యారెక్టర్ మాత్రమే మనం చూస్తామని అంటున్నాడు. సినిమాలో తన క్యారెక్టర్ బాగా రావడానికి చాలా సీరియస్ గా హార్డ్ వర్క్ చేస్తుందని, కొన్నిసార్లు తనకు తోచిన అభిప్రాయాలను పంచుకుంటూ పనిచేసే తత్వం అమెది అని కితాబిస్తున్నాడు.

కత్రినా తన కో స్టార్ అని చెప్పుకునేందుకు తనకు చాలా గర్వంగా ఉందన్నాడు. 'ఫిట్ నెస్ పై కూడా దృష్టిపెట్టే కత్రినా, గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేయడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను కూడా తనతో పాటు కొన్నిసార్లు జిమ్ కు వెళ్లేవాడిని. దాంతో పాటు తాను నటించే సీన్లు మరింత ఎఫెక్టివ్ గా రావడంలో భాగంగా ఆమె రిహార్సల్స్ చేస్తుంటుంది. సీనియర్ అయినప్పటికీ పాత్ర పట్ల ఆమెకున్న అంకితభావానికి ఎవరైనా ముగ్దులైపోతారు' అని సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రశంసల జల్లులు కురిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement