
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటి కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. అయితే ఈ భామ, తను డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘షేర్‌షా’ మూవీలో నటించింది. ఇటీవల ఓటీటీ విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ తరుణంలో ఆ సినిమాలో హీరో సిద్ధార్థ్‌తో తెరపై పండిన రొమాన్స్ గురించి ఓ ఇంటర్వూలో మాట్లాడింది కియారా. ‘బిగ్ స్క్రీన్‌పై కెమీస్ట్రీని ఎవరూ పండించలేరు. డైరెక్టర్ చెప్పింది మాత్రమే చేయగలం. ఈ మూవీలో నేను, సిద్ అదే చేశాం. అంతేకానీ ఏ ఇద్దరూ నటులు కూడా కథలో లేని దాన్ని చేసి చూపించలేరు’ అని ఈ బ్యూటీ తెలిపింది. విక్రమ్ బత్రా, ఆయన గర్ల్‌ఫ్రెండ్ డింపుల్ మధ్య జరిగిన విషయాలను డింపుల్ చెప్పింది కాబట్టే వారిద్దరూ చేయగలిగినట్లు నటి చెప్పింది. అయితే ఈ భామ ప్రస్తుతం హిందీలో ‘జగ్ జగ్ జీయో’,‘భుల్ భులయ్యా 2’, తెలుగులో రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో ‘ఆర్‌సీ15’లో నటిస్తోంది.
చదవండి: ఇబ్బందుల్లో ‘షేర్షా’ మూవీ.. బ్రాడ్ క్యాస్టింగ్ ఆపాలంటూ కేసు
Comments
Please login to add a commentAdd a comment