
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పెళ్లిపై స్పందించింది. గత కొంతకాలంగా ఆమె బాలీవుడ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్‌లో ఉన్నట్టు బీ-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసింతే. వీరిద్దరూ కలిసి హలీడే వేకషన్‌కు మాల్దివులకు వెళ్లడం, తరచూ కియారా సిద్దార్థ్ ఇంటికి వెళుతూ మీడియా కెమెరాలకు చిక్కడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే తమ రిలేషన్‌పై ఈ కపుల్ ఎప్పుడు స్పందించలేదు. ఇదిలా ఉండగా కియారా, సిద్దార్థ్‌లు జంటగా నటించిన ‘షేర్షా’ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది.
ఈ నేపథ్యంలో కియారా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా సిద్దార్థ్‌తో తన రిలేషన్, అలాగే తన వివాహ ప్రణాళికి గురించి కూడా చెప్పుకొచ్చింది. కియారా మాట్లాడుతూ.. సిద్దార్థ్ మంచి నటుడని తన పనిపై ఎప్పుడు ఫోకస్‌గా ఉంటాడంటూ అతడిపై ప్రశంసలు కురిపించింది. ఇక సిద్దార్థ్ పరిశ్రమలో తనకు అత్యంత సన్నిహితుడని, తామిద్దరం మంచి స్నేహితులుగా ఉంటామంటూ సిద్దార్థ్‌తో రిలేషన్‌పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది ఈ భామ.
ఇక తన పెళ్లి ఎప్పుడని హోస్ట్ ప్రశ్నించగా.. తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో తెలియదు కానీ అరెంజ్‌డ్ మ్యారేజ్ మాత్రం చేసుకోనని చెప్పింది. తను ఎప్పటికైనా లవ్ మ్యారేజ్‌యే చేసుకుంటానని స్పష్టం చేసింది. ‘షేర్షా’ చిత్రం పరమ వీర చక్ర అవార్డు గ్రహీత, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందింది. ఇక దీని అనంతరం కియారా రామ్‌చరణ్‌తో మరోసారి జోడి కట్టనుంది. సన్సెషనల్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘ఆర్‌సీ 15’ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కియారా నటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment