ముంబై: శాంతను బగ్చీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిషన్ మజ్ను’. ఈ చిత్రం షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ మోకాలికి గాయమైంది. అయినప్పటికీ షూట్ ని ఆపకుండా తరువాత 3 రోజులు కొనసాగించాడు. సిద్ధార్థ్ మల్హోత్రాకు సన్నిహితులలో ఒకరు అతని మోకాలికి లోహపు ముక్క తగిలి గాయమైందని వెల్లడించారు. గాయం తరువాత అతనికి రక్తస్రావం, వాపు లాంటివి లేవు, కానీ నొప్పితో మాత్రం బాధపడుతున్నాడని తెలిపాడు.
‘మిషన్ మజ్ను’ 1970 కాలానికి సంబంధించిన కథ కావడంతో అప్పటి కాలం సెట్ వేయడానికి నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారు. కాబట్టే, నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశ్యంతో మల్హోత్ర దెబ్బ తగిలినప్పటికీ షూటింగును కొనసాగించాడు. ‘మిషన్ మజ్ను’ తో దక్షిణాది హీరోయిన్ రష్మిక మందన్నా తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. 1970లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. భారతదేశం అత్యంత సాహసోపేతమైన మిషన్ కు సంబంధించిన కథ, అలాగే ఇది రెండు దేశాల మధ్య సంబంధాన్ని శాశ్వతంగా మార్చివేసిన సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.
( చదవండి: ‘వైల్డ్‌డాగ్ ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు’ )
Comments
Please login to add a commentAdd a comment