
Rashmika Mandanna Tells About Working With Sidharth Malhotra: క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో నేషనల్ క్రష్‌గా స్థానం సంపాదించుకుంది రష్మిక మందన్నా. తన అల్లరి చేష్టలతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ బ్యూటీ. ఇటీవల పాన్ ఇండియాగా విడుదలైన 'పుష్ప' చిత్రంలో శ్రీవల్లిగా ప్రేక్షకుల మదిని దోచిందీ చిన్నది. సినిమాలతో బిజీగా ఉండే రష్మిక చుట్టూ రూమర్స్ కూడా బిజీగానే గింగిరాలు తిరుగుతున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో పుకార్లు చెలరేగిపోతున్నాయి. ఇటీవల గోవాలో దిగిన ఫొటోలు లీక్ కావడంతో పుకార్లు నిజమే అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక ఒక హీరోతో పని చేయడం సరదాగా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దక్షిణాది ప్రేక్షకులు, అభిమానులను అలరించిన రష్మిక మందన్న బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. బీటౌన్‌లో 'మిషన్ మజ్నూ' సినిమాతో తెరంగ్రేటం చేయనుంది. ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించాడు. ఇటీవల ఎన్‌ఐతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ చిత్రం విశేషాలు, హీరోతో పనిచేయడం వంటి అనుభవాలను పంచుకుంది రష్మిక. ఇందులో 'సిద్ధార్థ్‌తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంది. మేము చాలా విషయాలపై మాట్లాడుకున్నాం. మేము సెట్‌లో కలిసి చాలా సార్లు భోజనం చేశాం. వర్క్ అవుట్ చేశాం. సిద్ధార్థ్ అద్భుతమైన నటుడు, మంచి వ్యక్తి. మిషన్ మజ్నూ చిత్రం ఎప్పుడూ నా హృదయానికి సన్నిహితంగా ఉంటుంది.' అని తెలిపింది రష్మిక.
'మిషన్ మజ్నూ' చిత్రానికి శాంతను బాగ్చి దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా ఒక ఇండియన్ ఆపరేషన్‌కు నాయకత్వం వహించే 'రా' ఏజెంట్ పాత్ర పోషిస్తున్నాడు. 1970 కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా వంటి ప్రముఖ తారలతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది రష్మిక మందన్నా.
ఇదీ చదవండి: కాబోయే భర్తపై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇల్లరికం వస్తేనే పెళ్లి
Comments
Please login to add a commentAdd a comment