
బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ పుట్టినరోజు నేడు (జూలై 31)

బొంబేలో పుట్టి పెరిగిన ఈమె అసలు ఆలియా అడ్వాణీ.

ఈమె ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికీ ఆలియా భట్ ఉండటంతో పేరు మార్చుకోవాల్సి వచ్చింది.

ఈమె తాత తరంలో యాక్టర్స్ ఉన్నారు. దీంతో ఈమెకు అవకాశం సులువుగానే వచ్చింది.

2014లో 'ఫగ్లీ', 2016లో 'ధోనీ' మూవీతో హీరోయిన్ అయింది.

తెలుగులోనూ 'భరత్ అను నేను', 'వినయ విధేయ రామ' సినిమాలు చేసింది.

ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ కాంబోలోని 'గేమ్ ఛేంజర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తోంది.

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈమె.. గతేడాది ఇతడిని పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా వరస సినిమాలు చేస్తోన్న కియారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

















