పెళ్లి బిజీలో కియారా.. డ్యాన్సింగ్‌ టైం అంటున్న రామ్‌చరణ్‌ | Ram Charan, Shankar Movie Next Schedule Starts In Hyderabad | Sakshi
Sakshi News home page

Ram Charan: పెళ్లి బిజీలో కియారా.. సింగిల్‌గా స్టెప్పులేస్తున్న చెర్రీ

Published Mon, Feb 6 2023 9:14 AM | Last Updated on Mon, Feb 6 2023 9:14 AM

Ram Charan, Shankar Movie Next Schedule Starts In Hyderabad - Sakshi

సో.. రామ్‌చరణ్‌కు ఇది డ్యాన్సింగ్‌ టైమ్‌. డిఫరెంట్‌ లొకేషన్స్‌లో పాట చిత్రీకరణ జరగనుండటం విశేషం. 

హీరో రామ్‌చరణ్‌ డ్యాన్స్‌ మోడ్‌లోకి వెళ్లారు. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ఓ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు.

సో.. రామ్‌చరణ్‌కు ఇది డ్యాన్సింగ్‌ టైమ్‌. డిఫరెంట్‌ లొకేషన్స్‌లో పాట చిత్రీకరణ జరగనుండటం విశేషం. పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న కియారా త్వరలోనే తిరిగి సెట్స్‌లో పాల్గొననున్నట్లు కనిపిస్తోంది. తొలుత హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపి తర్వాత వైజాగ్, రాజమండ్రిలో షూటింగ్‌ జరిపేలా ప్లాన్‌ చేశారట చిత్రయూనిట్‌. అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

చదవండి: బ్లాక్‌బస్టర్‌ గీత గోవిందం కాంబినేషన్‌ రిపీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement