ధనుష్‌తో కియారా రొమాన్స్‌ | Kiara Advani To Pair Up With Dhanush | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో కియారా రొమాన్స్‌

Published Mon, Jun 3 2024 7:07 AM | Last Updated on Mon, Jun 3 2024 8:51 AM

Kiara Advani To Pair Up With Dhanush

బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా నటుడు ధనుష్‌. ఈయన నటుడు మాత్రమే కాకుండా గాయకుడు, గీత రచయిత, కథకుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ నటిస్తూ పాన్‌ ఇండియా కథానాయకుడుగా రాణిస్తున్నారు. తాజాగా ఈయన తమిళంలో రాయల్‌ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించారు సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది కథానాయకుడుగా ధనుష్‌ 50వ చిత్రం కావడం గమనార్హం. 

అదేవిధంగా తెలుగులో కుబేర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్‌ నటుడు నాగార్జున ముఖ్యపాత్రను పోషిస్తుండగా, రష్మికమందన్న నాయకిగా నటిస్తున్నారు. కాగా ధనుష్‌ ఇంతకుముందు రంజనా, షమితాబ్, అత్రాంగి రే వంటి హిందీ చిత్రాల్లో నటించి అక్కడ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న విషయం తెలిసింది. 

తాజాగా మరోసారి బాలీవుడ్‌ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. దీనికి బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఇందులో కథానాయకిగా  బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈమె ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌ సరసన నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement