
బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తరచూ డిన్నర్ పార్టీలని, హాలీడే ట్రిప్‌లని ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లో నిలుస్తుంటారు. మరి ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటి కానుందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షోలో కూడా తాము లవ్‌లో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు.
ఇదిలా ఉంటే తాజాగా కియారా అద్వానీ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెళ్లి వార్తలకు ఆ వీడియో మరింత బలం చేకూరుస్తోంది. కియారా తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో చాలా అందంగా నవ్వుతూ కనిపించారు. కియారా అద్వానీ వీడియోను షేర్ చేస్తూ తన అభిమానులను ఆటపట్టించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి ప్రకటన చేస్తుందని ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు.
ఇన్‌స్టాలో కియారా వీడియో షేర్ చేస్తూ.. ' ఈ రహస్యాన్ని ఇంకా ఎక్కువ కాలం దాచలేను. త్వరలోనే ప్రకటిస్తున్నా. డిసెంబర్ 2న ప్రకటిస్తా. వేచి ఉండండి' అంటూ పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ అభిమాని సిద్ధార్థ మల్హోత్రా పెళ్లి చేసుకుంటున్నారా? అని కామెంట్ చేయగా.. మరొకరు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసమేనా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్‌లతో కలిసి నటించిన గోవిందా నామ్ మేరా విడుదలకు సిద్ధమవుతోంది. గోవింద నామ్ మేరా డిసెంబర్ 16న ఓటీటీలో విడుదల కానుంది. ఆమె తర్వాత కార్తీక్ ఆర్యన్‌తో సత్యప్రేమ్ కి కథ, రామ్ చరణ్‌తో ఆర్‌సీ15 కనిపించనుంది.