Kriti Sanon, Kiara Advani, Anushka, Jyothika Re Entry In Tollywood, Latest Movie Updates - Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తర్వాత కృతీ, దిశా.. మూడేళ్ల తర్వాత కియరా, ఎందుకీ గ్యాప్‌?

Jan 31 2023 10:10 AM | Updated on Jan 31 2023 11:16 AM

Kriti Sanon, Kiara Advani, Anushka, Jyothika Re Entry In Tollywood, Latest Movie Updates - Sakshi

ఏడేళ్ల తర్వాత తెలుగుకి వచ్చారు కృతీ సనన్‌.. దిశా పటానీ. మూడేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు కియారా అద్వానీ.. మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు అనుష్క.  ఇరవైరెండేళ్ల తర్వాత హిందీ సినిమా చేశారు జ్యోతిక.. ఎందుకీ గ్యాప్‌ అంటే.. వేరే భాషల్లో సినిమాలు చేయడంవల్ల, వేరే కారణాల వల్ల అన్నమాట.అంతేకానీ కావాలని ‘గ్యాప్‌ ఇవ్వలా... వచ్చింది’. ఇక తెలుగు, హిందీలో గ్యాప్‌ తర్వాత ఈ స్టార్స్‌ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం...

‘జియా జలే...’ అంటూ వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘లోఫర్‌’లో చాలా హాట్‌ హాట్‌గా స్టెప్పులేసిన దిశా పఠానీ గుర్తుందా? తెలుగులో తనకు ఇదే తొలి చిత్రం. ఆ మాటకొస్తే.. హీరోయిన్‌గానే మొదటి సినిమా. 2015లో ఈ సినిమా వచి్చంది. ఆ తర్వాత ఈ నార్త్‌ బ్యూటీ హిందీ పరిశ్రమకు వెళ్లి మళ్లీ తెలుగువైపు చూడలేదు. ఈ ఏడేళ్లల్లో అక్కడ సినిమాలు చేస్తూ వచి్చన దిశా చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ‘΄ాజెక్ట్‌ కె’. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశి్వన్‌ దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ΄ాన్‌ 
ఇండియా సినిమా ద్వారా దిశా గ్రాండ్‌గా రీ–ఎంట్రీ ఇస్తున్నారు.

దిశాలానే కృతీ సనన్‌ కూడా పాన్‌ ఇండియా సినిమా ‘ఆదిపురుష్‌తో తెలుగు తెరపై గ్రాండ్‌ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే దిశాలానే ప్రభాస్‌ సరసన కనిపించనున్నారు. ఆ బ్యూటీలానే కృతీ కూడా ఏడేళ్లకు తెలుగుకి వస్తున్నారు. మహేశ్‌బాబు సరసన ‘1 నేనొక్కడినే’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి ఆ తర్వాత నాగచైతన్య సరసన  ‘దోచేయ్‌’ (2015) చేశారు. మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక ‘ఆదిపురు‹Ù’ విషయానికొస్తే.. ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాముడి పాత్రలో ప్రభాస్‌ నటించగా సీతగా కృతీ సనన్‌ చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇక హిందీ చిత్రం ‘ఫగ్లీ’ (2014) ద్వారా హీరోయిన్‌గా పరిచయ మైన కియారా అద్వానీ ఆ తర్వాత నాలుగేళ్లకు తెలుగు తెరపై మెరిశారు. మహేశ్‌బాబు సరసన ‘భరత్‌ అనే నేను’ (2018) చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్‌చరణ్‌ సరసన ‘వినయ విధేమ రామ’ (2019)లో నటించారు. హిందీ చిత్రాలు చేస్తూ వస్తున్న  కియారా కొంత గ్యాప్‌ తర్వాత తెలుగు తెరపై మళ్లీ రామ్‌చరణ్‌ సరసనే కనిపించనున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీలో కియారా కథానాయికగా నటిస్తున్నారు. దిశా, కృతీలానే ఈ బ్యూటీ కూడా గ్రాండ్‌గా పాన్‌ ఇండియా మూవీతో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ ముగ్గురూ పాన్‌ ఇండియా సినిమాల ద్వారా మళ్లీ తెలుగులో కనిపించనుండటం వారికే కాదు.. వారి ఫ్యాన్స్‌కి కూడా ఆనందంగా ఉంటుంది.

నిశ్శబ్దంగా... 
అనుష్క రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా తెరపై కనిపించారు. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ చిత్రంలో బదిరురాలు (మూగ, చెవిటి) పాత్ర చేశారు అనుష్క. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంతకుముందు 2019లో చిరంజీవి నటించిన ‘సైరా’లో వెండితెరపై కనిపించారు అనుష్క. సో.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ బ్యూటీ కనిపించి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు అనుష్క. ఇందులో నవీన్‌ పొలిశెట్టి హీరో. మహేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. పెద్ద అప్‌డేట్స్‌ ఏవీ ఇవ్వకుండా ఈ చిత్రం షూటింగ్‌ని నిశ్శబ్దంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ అనే టైటిల్‌ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇరవైరెండేళ్లకు హిందీలో...
హిందీ చిత్రం ‘డోలీ సజా కే రఖ్నా’ (1998)తో తన కెరీర్‌ను ప్రారంభించారు జ్యోతిక. ఆ తర్వాత ‘వాలీ’ సినిమాతో తమిళ్‌కి పరిచయమై, వరుసగా తమిళ్, తెలుగు.. ఇలా దక్షిణాది భాషల్లో హీరోయిన్‌గా బిజీ అయ్యారు. హీరో స్యూరని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయ్యాక కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె. 2009 నుంచి 2014 వరకూ సినిమాలు చేయలేదు. 2015లో ‘36 వయదినిలే’తో రీ–ఎంట్రీ ఇచ్చి, లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఇక జ్యోతిక చివరిగా హిందీ తెరపై కనిపించిన సినిమా ‘లిటిల్‌ జాన్‌’ (2001). ఇన్నేళ్ల తర్వాత ఆమె ఆ మధ్య హిందీ సినిమా ‘శ్రీ’ అంగీకరించారు. రాజ్‌కుమార్‌ రావ్‌ హీరోగా తుషార్‌ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘శ్రీ’లో నా ΄ాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. భారమైన హృదయంతో ఈ యూనిట్‌ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు జ్యోతిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement