
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అంటే ఒకప్పుడు బిగ్ మూవీస్,మాస్ మసాలా సబ్జెక్ట్స్. కానీ, రంగస్థలంతో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేయడం మొదలు పెట్టాడు చరణ్. యాక్టింగ్ తో షాక్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సుకుమార్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు క్యారెక్టర్ ఇస్తే.. అందులోకి పరకాయ ప్రవేశం చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి..అల్లూరి సీతారామరాజు పాత్ర(ఆర్‌ఆర్‌ఆర్) ఇస్తే, ఆయనే ఆశ్చర్యపడేలా నటించాడు. ఇప్పుడు శంకర్ మూవీలోనూ తన యాక్టింగ్‌తో షాక్ ఇవ్వబోతున్నాడట మెగా పవర్ స్టార్.
ఈ చిత్రంలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని చాలా కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులుగా చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది.అయితే చరణ్ ఇందులో డ్యూయల్ రోల్ కాదు , ట్రిపుల్ రోల్ చేస్తున్నాడట. తండ్రితో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లో చరణ్ నటిస్తున్నాడని,అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని టాలీవుడ్ లో బాగా డిస్కషన్ జరుగుతోంది.
(చదవండి: బిగ్‌బాస్ 6లో పాల్గొనాలనుకుంటున్నారా? ఇలా చేయండి)
శంకర్ ఇచ్చిన ట్రిపుల్ రోల్ టాస్క్‌ని చాలెజింగ్‌గా తీసుకున్నాడట చరణ్. ఈసారి కూడా తన యాక్టింగ్ తో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. ఇందులో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. విడుదల తర్వాత శంకర్, చరణ్ ఏరేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారనేది చూడాలి మరి.