హీరోయిన్ బర్త్ డే.. 'గేమ్ ఛేంజర్' టీమ్‌కి తప్పని ట్రోల్స్! | Kiara Advani Birthday Game Changer Movie Poster | Sakshi
Sakshi News home page

Kiara Advani: హీరోయిన్ పుట్టినరోజు పోస్టర్.. ఫ్యాన్స్ విమర్శలు!

Published Wed, Jul 31 2024 1:21 PM | Last Updated on Wed, Jul 31 2024 1:39 PM

Kiara Advani Birthday Game Changer Movie Poster

బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ పుట్టినరోజు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఈమె హీరోయిన్‌గా చేస్తున్న 'గేమ్ ఛేంజర్' టీమ్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. నార్మల్‌గా అయితే ఇదేమంత పెద్దగా పట్టించుకునే విషయం కాదు. కానీ కియారాకు విషెస్ చెప్పడం కోసం వేసిన పోస్టర్ వల్ల ట్రోల్స్ వస్తున్నాయి.

(ఇదీ చదవండి: రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని విజయ్ సేతుపతి.. ఇప్పుడేమో జాక్‌పాట్!)

'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలుపెడితే ఇప్పటికీ ఇంకా అలా నడుస్తూనే ఉంది. ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ మూవీ నుంచి 'జరగండి జరగండి' అనే పాట తప్పితే మరో కంటెంట్ బయటకు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు కియారా పుట్టినరోజని చెప్పి అదే పాటలోని లుక్ రిలీజ్ చేశారు. ఇదే ట్రోల్స్‌కి కారణమైంది.

సినిమాలో మరో కంటెంటే లేనట్లే అదే పాటలోని ఫొటోలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్‌గా 'భారతీయుడు 2'తో ఘోరమైన డిజాస్టర్ అందుకున్న శంకర్.. దీనికి దర్శకుడు. మరి ఏం చేస్తాడో ఏంటో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికైనా సరే వేరే కంటెంట్ తీసుకొస్తే 'గేమ్ ఛేంజర్'పై బజ్ పెరగొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు!

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement