
మగాళ్లకూ కష్టాలున్నాయి
ఆడ, మగ తేడాలతో సమాజం వివక్ష చూపిస్తోంది. ఈ వివక్ష నచ్చడం లేదు.
ఆడ, మగ తేడాలతో సమాజం వివక్ష చూపిస్తోంది. ఈ వివక్ష నచ్చడం లేదు. వంటింట్లో మహిళలు, బయట మగవాళ్లు కష్టపడుతున్నారు. భార్యకు నగలు, చీరలు, పిల్లల స్కూల్ ఫీజులు, పెట్రోల్ బిల్లు... మగాళ్లకూ ఎన్నో కష్టాలున్నాయి.
మహిళల బాధలు వేరు, మగవాళ్ల బాధలు వేరు. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు ప్రతి సమస్యనూ రెండు కోణాల్లో చూడాలి. సమస్య ఉందని అమ్మాయిని బయటకు వెళ్లొద్దని చెప్పొద్దు. జాగ్రత్తగా ఉండమని చెప్పం . మహిళల పట్ల ఎలా మసలుకోవాలో మగవాళ్లకు అమ్మలే నేర్పించాలి. నిజానికి విమెన్స్ డే ఈజ్ క్రాప్. (ఈ మహిళా దినోత్సవం అనేది అనవసరమైన ఆలోచన). అన్ని రోజులూ మహిళలకు మంచి చేయాలనుకుంటే చాలు.