కితకితలు పెట్టే పాత్ర నాది! - అడివి శేష్ | Dongaata falls into Money genre : Adivi Sesh | Sakshi
Sakshi News home page

కితకితలు పెట్టే పాత్ర నాది! - అడివి శేష్

Published Tue, Apr 14 2015 10:31 PM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

కితకితలు పెట్టే పాత్ర నాది! - అడివి శేష్

కితకితలు పెట్టే పాత్ర నాది! - అడివి శేష్

 కర్మ’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అడివి శేష్. ‘పంజా’ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత చాలా ‘బలుపు, రన్ రాజా రన్, లేడీస్ అండ్ జెంటిల్మన్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన  చిత్రం ‘దొంగాట’. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ముచ్చటించారు. ‘‘ నేను చేసిన వెంకట్ పాత్రలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి . చాలా కొత్తగా అనిపించింది. వెంటనే ఈ ఆఫర్‌కు ఒప్పుకున్నా.
 
  మొదట ఈ పాత్ర వేరే వాళ్ల కోసం అనుకున్నారు. కానీ ఫైనల్‌గా నాకే దక్కింది. కన్‌ఫ్యూజన్ లోంచి పుట్టే కామెడీ ప్రేక్షకులకు కితకితలు పెడుతుంది. మొదటి సినిమా అయినా వంశీ చాలా బాగా తీశారు. లక్ష్మీ మంచు నాకు మంచి స్నేహితురాలు. షూటింగ్ కూడా చాలా సరదా సరదాగా గడిచిపోయింది. ‘బాహుబలి’ సినిమా మొదటి భాగంలో కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటాను కానీ నా కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోతుందీ సినిమా. ప్రస్తుతం పీవీపీ బ్యానర్‌లో ‘క్షణం’ అనే సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్నా’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement