Lakshmi Manchu: మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ.. పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంది ఈ విలక్షణ నటి. ఫన్నీ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది.
తాజాగా ఈ మంచు బ్యూటీ.. తన ఇంటి విశేషాలను అభిమానులతో పంచుకుంది. ఇటీవల యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించిన మంచు లక్ష్మీ.. తన ఇంటి అందాలు వీడియో చేసి ‘మై హోమ్ టూర్’విడుదల చేసింది. అందులో వంట గది, ఆఫీస్, తను సినిమాలు చూసే హాల్.. ఇలా ఇంట్లో ఉన్న ప్రత్యేక గదులన్నింటిని చూపించింది. ఇంద్ర భవనంగా మెరిసిపోతున్న మంచు వారసురాలి ఇంటిని మీరు కూడా చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment