రామ్‌గోపాల్ వర్మను డెరైక్ట్ చేయమంటే కుదరదన్నారు! | Dongata Movie Release on May 8th | Sakshi
Sakshi News home page

రామ్‌గోపాల్ వర్మను డెరైక్ట్ చేయమంటే కుదరదన్నారు!

Published Mon, May 4 2015 10:41 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

రామ్‌గోపాల్ వర్మను డెరైక్ట్ చేయమంటే కుదరదన్నారు!

రామ్‌గోపాల్ వర్మను డెరైక్ట్ చేయమంటే కుదరదన్నారు!

‘‘ఈ చిత్రాన్ని రామ్‌గోపాల్ వర్మ డెరైక్షన్‌లో చేయాలనుకున్నాను. ఆయనను అడిగితే, ఇది తన జానర్ సినిమా కాదని నిరాకరించారు. ఆ తర్వాత వంశీకృష్ణను అడిగాను. ఎప్పట్నుంచో తను నాకు ఫ్రెండ్. దర్శకుడిగా మొదటి సినిమా నాతోనే చేస్తానన్నాడు. అలానే చేశాడు. ఈ చిత్రాన్ని వంశీ బాగా తీస్తాడననుకున్నాను కానీ, ఇంత బాగా తీస్తాడని మాత్రం అనుకోలేదు’’ అని మంచు లక్ష్మి అన్నారు. విద్యా నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నటించి, నిర్మించిన చిత్రం ‘దొంగాట’. అడివి శేష్, మధు నందన్ ముఖ్య పాత్రలు చేశారు.
 
  ఈ నెల 8న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ - నాగార్జున, రవితేజ, మనోజ్, నాని, రానా, సుశాంత్, సుదీప్, నవదీప్, శింబు, తాప్సీ నటించిన పాట ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా ద్వితీయార్ధంలో నా పుట్టినరోజు సందర్భంగా వచ్చే పాట ఇది. నేను పాడిన ‘ఏందిరో..’ పాటకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌ని కిడ్నాప్ చేస్తారు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రం తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించబోతున్నాననీ, అతను దర్శకత్వం వహించిన ‘సైన్మా’ అనే లఘు చిత్రం చూసి, అవకాశం ఇస్తున్నాననీ లక్ష్మి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement