డల్లాస్ : డల్లాస్ మహానగరంలో ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మంచులక్ష్మితో ఫైర్ సైడ్ చాట్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచులక్ష్మి తాను మేముసైతం ప్రోగ్రాం ద్వారా చేస్తున్న సమాజసేవని వివరించారు. ఒక మహిళ నేటి సమాజంలో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నా, ఒకనటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా నిలవడం ఎంత కష్టమో అని ఒకనటిగా, నిర్మాతగా, సంఘ సేవకురాలిగా చెప్పారు. మహిళకు అన్నిరంగాలలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని కాని వాటినన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవాలని అక్కడికి వచ్చిన మహిళలను లక్ష్మీ ఉత్తేజపరిచారు.
మంచులక్ష్మి తన సమయాన్ని కేటాయించి మహిళను సమాజంలో వివిధ రంగాలలో రాణించాలని ప్రోత్సహించడంతో పాటుగా, తను చేస్తున్న సామాజిక సేవని గుర్తించి ఉత్తర టెక్సాస్‌లో తెలుగు సంఘం, నాటా వారు ఆమెను పుష్పగుచ్చాలు, పీఠికలు, సాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి డల్లాస్‌లో తెలుగు వారు సుమారుగా 500 మందికి పైగా హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు వారికి, మీడియా వారికి, ఆతిధ్యమిచ్చిన హిల్టాప్ ఇండియా న్రెస్టారెంట్వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాటాఎలెక్ట్ ప్రెసిడెంట్ కొర్సాపాటి శ్రీధర్ రెడ్డికి, మిగిలిన కార్యవర్గ, పాలక మండలి సభ్యులకు ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment