Telugu Association of north texas
-
టాంటెక్స్‌లో ఘనంగా ''నెలనెల తెలుగువెన్నెల'' 208వ సాహిత్య సదస్సు
డాలస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 208 వ సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ''తెలుగు భాషా సాహిత్యాలు- సమకాలీన సందిగ్ధ సమస్యలు'' అనే అంశంపై సదస్సు రసవత్తరంగా జరిగింది. ముందుగా ఈ వేదిక లెనిన్ వేముల "హిమగిరి తనయే హేమలతే" ప్రార్ధనా గీతంతో ప్రారంభమయ్యింది. పాలక మండలి సభ్యులు సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేసి,' మాసానికో మహనీయుడు' శీర్షికలో గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయ శర్మ గారి పాండిత్య ప్రతిభావిశేషాలను సభకు పరిచయం చేశారు. 'మన తెలుగు సిరి సంపదలు' శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది. లెనిన్ వేముల గుర్రం జాషువా ''గబ్బిలం'' పద్య గానం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. తరువాత ప్రముఖ రచయిత సత్యం మందపాటి మధురాంతకం రాజారాం, నరేంద్రలతో ఉన్న తన జ్ఞాపకాలను పంచుకొన్నారు.. మధురాంతకం రాజారాం గారి మేనల్లుడు శ్రీ భాస్కర్ పులికల్ గారు మధురాంతకం రాజారామ్ గారితో తన అనుబంధాన్ని తెలియజేయడంతో పాటు తన బావ మధురాంతకం నరేంద్రతో తన రచనల ప్రయాణాన్ని విశదీకరించడం జరిగింది . ఈ వేదికకు విచ్చేసిన ముఖ్య అతిథి ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ.. తన తండ్రి మధురాంతకం రాజారాం తెలుగు, ఆంగ్లభాషలలో రచయిత, కథకులు కావడంతో తెలుగు భాషా సాహిత్యం పై మక్కువ పెంచుకొని తాను విద్యార్థి దశలోనే కథలు రాయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. కథ చదివే ప్రతి వ్యక్తిలో తద్వారా మన సమాజంలో ఒక సకారాత్మకమైన మార్పు తీసుకురావాలనేది తన ఆకాంక్షగా పేర్కొన్నారు.తన తండ్రి పేరు మీదుగా ''కథాకోకిల'' అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది కొందరు మంచి రచయితలను సత్కరించడాన్ని అలవాటుగా చేసుకున్నానని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించబడడంతో భాషకి జరుగుతున్న నష్టాలను సోదాహరణంగా వివరిస్తూ తొండనాడు చరిత్ర ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడుఅనీ రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉందనీ తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల రచనలను పరిశీలించినపుడు తెలుగు తమిళ భాషలు పెనవేసుకొని ఉండడాన్ని గమనించవచ్చు అని చెప్పారు. మన నుంచి విడిపోయినప్పటికీ ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి, నాగర్ కోయిలు, తూత్తుకుడి,శ్రీ విల్లి పుత్తూరు, మదురై, తంజావూరు, తిరువాయూరు, కోసూరు, ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వారి సంఖ్య అధికముగా ఉందన్నారు. తెలుగు తమిళ భాషలు రెండూ వారి దైనందిన జీవితంలో భాగం కావడం గమనించదగిన విషయమన్నారు. అదేవిధంగా మాండలిక భాష రచనలను ప్రస్తావిస్తూ అందరికీ అర్థమయ్యే భాషలో రాయడమే ఉత్తమ విధానమని అన్నారు. తరువాత మధురాంతకం రాజారామ్ గారితో అమెరికాలో అనుభవాలను డాక్టర్ బోయారెడ్డి సాహితీ ప్రియులతో పంచుకొన్నారు. సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర , ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, డాక్టర్ కోట సునీల్, గోవర్ధనరావు నిడిగంటి నరేంద్ర గారి ప్రసంగంపై తమ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు. తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, తదుపరి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, పాలకమండలి ఉపాధిపతి శ్రీ హరి సింఘం మరియు సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి మధురాంతకం నరేంద్ర గారికి టాంటెక్స్ సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందన్నారు ఆచార్య మధురాంతకం నరేంద్ర . సభలో ప్రత్యక్షంగా, అంతర్జాలంలో అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. చివరిగా దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సతీష్ బండారు, తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ,ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు సతీష్ బండారు, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనలు తెలిపారు అధ్యక్షులు సతీష్ బండారు. (చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం') -
మహాత్ముడికి టాంటెక్స్ నివాళులు
టెక్సాస్: జనవరి 30న జాతిపిత గాంధీజీ వర్ధంతి. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలని చెప్పిన మహోన్నతుడాయన. 20వ శతాబ్దంలో భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేసేందుకు ముందుండి పోరాడారు. చేతిలో కర్ర పట్టుకుని, నూలు వడికి, మురికి వాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని చాటి చెప్పారు, సత్యం, అహింస అనేవి తన ఆయుధాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లోంచి భారతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు గాంధీ. గాంధీ వర్ధంతి సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సభ్యులందరి తరపున టాంటెక్స్ అద్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, సహాయ కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి జొన్నల స్థానికంగా జాఫర్ సన్ పార్క్, అర్వింగ్‌లోని మహాత్ముడి విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. (చదవండి: సాగువీరుడా ! సాహిత్యాభివందనం) -
టాంటెక్స్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో సంక్రాంతి సంబరాలు
ముత్యాల ముగ్గులు.. రత్నాల గొబ్బిళ్లు.. భోగిమంటలు.. పిండి వంటలు.. కొత్త అల్లుళ్లు.. కోడిపందేలు.. సంక్రాంతి వచ్చిందంటేనే సంబరం.. ఎక్కడ లేని ఉత్సాహం. ఊరికి, దేశానికి దూరంగా అమెరికాలో ఉన్న తెలుగు వారికి ఈ పండుగ అంటే ఇంకా మమకారం. అమెరికాలోని తెలుగువారు ప్రతి పండుగను ఘనంగా జరుపుకొనేలా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్(టాంటెక్స్) ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు చేస్తుంటుంది. తెలుగు వారి సాంస్కృతిక వారధి, మూడు దశాబ్దాలకి పైబడి వారి మనసులు చూరగొంటున్న టాంటెక్స్ ఈసారి కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. డల్లాస్/ఫోర్ట్ వర్త్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్(టాంటెక్స్) ఆధ్వర్యంలో స్థానిక ఫ్రిస్కో హైస్కూల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే విధంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో అమెరికాలోని తెలుగువారు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. టాంటెక్స్ అధ్యక్షుడు చిన్న సత్యం వీర్నపు, కార్యక్రమ, సాంస్కృతికి సమన్వయ కర్తలు ప్రబంధ్ రెడ్డి తోపుడుర్థి, సమీర ఇల్లెందుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు సభా ప్రాంగణాన్ని అలంకరించారు. చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్థానిక బావార్చి ఇండియన్ రెస్టారెంట్ పసందైన పండుగ భోజనాన్ని వడ్డించింది. ఈ కార్యక్రమ ప్రసెంటింగ్ స్పాన్సర్స్ నితిన్ రెడ్డి శీలం, నాట్స్, ఇందిర అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ఈవెంట్ స్పాన్సర్స్ డా. ఉరిమిండి నరసిం హారెడ్డి,సుబ్రమణ్యం జొన్నలగడ్డ అండ్ ఫ్యామిలీ, మనోహర్ కసగాని, ఉమామహేష్ పార్నపల్లి అండ్ ఫ్యామిలీ, శరత్ రెడ్డి యర్రం, ప్లాటినం పోషక దాతలైన బావార్చి ఇండియన్ రెస్టారెంట్, ప్రసూనాస్ కిచెన్, క్వాంట్ స్విస్ టంస్,ఆల్బెర్ట్ సంతయ్య ఆఫ్ యెడ్వార్డ్ జోన్స్, విక్రం జంగం, డా. పవన్ పమడుర్తి, ప్రతాప్ భీమిరెడ్డి, శ్రీకాంత్ పోలవరపు, గోల్డ్ పోషక దాతలైన పసంద్ రెస్టారెంట్, విష్ పాలెపు సి.పి.ఏ, మైటాక్స్ ఫైలర్, మైటాక్స్ ఫైలర్, రాం కొనార, మెహతా జూలెర్స్, అడయార్ ఆనంద్ భవన్, బసేర ఇండియన్ రెస్టారెంట్, కిషొర్ చుక్కాల, సిల్వర్ పోషక దాతలైన సిం-పర్వతనేని- బ్రౌన్ లా ఆఫీసెస్, మురళి వెన్నం, డా. సుమన కేత, డా.భాస్కర్ రెడ్డి సానికొమ్ము, పెంటా బిల్డర్స్, టాంటెక్స్ మాజీ అధ్యక్షురాలు క్రిష్ణవేణి శీలంలకు చినసత్యం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. -
మంచులక్ష్మితో ఫైర్ సైడ్ చాట్ షో
డల్లాస్ : డల్లాస్ మహానగరంలో ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మంచులక్ష్మితో ఫైర్ సైడ్ చాట్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచులక్ష్మి తాను మేముసైతం ప్రోగ్రాం ద్వారా చేస్తున్న సమాజసేవని వివరించారు. ఒక మహిళ నేటి సమాజంలో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నా, ఒకనటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా నిలవడం ఎంత కష్టమో అని ఒకనటిగా, నిర్మాతగా, సంఘ సేవకురాలిగా చెప్పారు. మహిళకు అన్నిరంగాలలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని కాని వాటినన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవాలని అక్కడికి వచ్చిన మహిళలను లక్ష్మీ ఉత్తేజపరిచారు. మంచులక్ష్మి తన సమయాన్ని కేటాయించి మహిళను సమాజంలో వివిధ రంగాలలో రాణించాలని ప్రోత్సహించడంతో పాటుగా, తను చేస్తున్న సామాజిక సేవని గుర్తించి ఉత్తర టెక్సాస్‌లో తెలుగు సంఘం, నాటా వారు ఆమెను పుష్పగుచ్చాలు, పీఠికలు, సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి డల్లాస్‌లో తెలుగు వారు సుమారుగా 500 మందికి పైగా హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు వారికి, మీడియా వారికి, ఆతిధ్యమిచ్చిన హిల్‌టాప్ ఇండియా న్రెస్టారెంట్వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాటాఎలెక్ట్ ప్రెసిడెంట్ కొర్సాపాటి శ్రీధర్ రెడ్డికి, మిగిలిన కార్యవర్గ, పాలక మండలి సభ్యులకు ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం తరుపున ధన్యవాదాలు తెలిపారు. -
అట్టహాసంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
డాలస్/ఫోర్ట్ వర్త్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) డల్లాస్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. సాంస్కృతిక బృంద సమన్వయకర్త లక్ష్మి పాలేటి , కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం ఆధ్వర్యంలో ఉప్పలపాటి కృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జనవరి 28న డల్లాస్ లోని ఇర్వింగ్ హైస్కూల్లో టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ప్రధాన వ్యాఖ్యాతలుగా సమీరా ఇల్లందుల, మధుమహిత మద్దుకూరి, అభినుత మద్దుకూరిలు సంప్రదాయానికి పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. 2017 వ సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని టాంటెక్స్ నూతన అధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డిని పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సభకు పరిచయం చేశారు. ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి పర్వదినాన నూతన ఉత్సాహంతో తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్ధంగా భావిస్తానని చెప్పారు. తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని, మహా తెలుగు సభలు టాంటెక్స్ ఆధ్వరంలో నిర్వహిస్తామన్నారు. మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గతేడాది మీరు అందించిన సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని, తెలుగు జాతి అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. జొన్నలగడ్డకి శాలువా కప్పి పుష్పగుచ్చాలతో టాంటెక్స్అధ్యక్షులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి గారు, పాలకమండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే కార్యనిర్వాహక సభ్యులుగా విశేష సేవలందించిన జ్యోతి వనం, వెంకట్ దండ, రఘుగజ్జల, సుగన్ చాగర్లమూడి, శ్రీనివాస రెడ్డి గుర్రంలను జ్ఞాపికలతో సత్కరించారు.ఇక్కడికి విచ్చేసిన టాటా సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు, డైమండ్పోషక దాత డా.ఝాన్సి రెడ్డిని కార్యవర్గం సన్మానించింది. విశిష్ట అతిధి, బుల్లి తెర వ్యాఖ్యాత, చలన చిత్ర నటుడు జెమిని సురేష్ తన సినీ అనుభవాలను పంచుకున్నారు. స్వరమంజరి అనే కార్యక్రమం ద్వారా టాంటెక్స్ వారు నూతన కళాకారులను వెలుగులోకి తెచ్చి వారికి చక్కని అవకాశాలు కల్పిస్తారు. 2016 విజేతలయిన స్నిగ్ధ ఏలేశ్వరపు, కీర్తి చామకూర, దీపికా కాకర్ల అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను మైమరపింప చేశారు. శ్రీ లక్ష్మితోరం నేతృత్వంలో నాట్య ప్రదర్శన, గిరిజా ఆనంద్ రూపకల్పనలో ‘శివ పూజకు వేళాయరా’, శ్రీ దేవి యడ్లపాటి గారి ఆధ్వర్యంలో ‘శంభో శివ శంభో’ అనే పాటకు, జయలక్ష్మి గొర్తి ‘శ్రీమాన్నారాయణ’ శాస్త్రీయ నృత్యం, రూప బంద రూపకల్పనలో ‘ఓం మహాప్రాణ దీపం’ నృత్యం, హేమమాలిని చావలి ‘కొలువైతివా రంగ సాయి’ అంటూ చక్కని నృత్యాలు కనుల విందు చేశాయి. నూతన కార్యనిర్వాహక సభ్యులు భాను లంక, మనోహర్ కాసగాని, ప్రబంధ రెడ్డి తోపుదుర్తి, శరత్ రెడ్డి ఎర్రం, సమీరా ఇల్లందులను, పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి, రాం కొనార, వేణు పావులూరిలను కమిటీలోకి ఆహ్వానించారు. క్రాంతి కార్యక్రమం చేపట్టిన చంద్రశేఖర్ కాజ,అజయ్ గోవాడ, శ్రీలు మండిగ, జెమిని సురేశ్ లను సత్కరించారు. ఆహూతులకు టచ్ నైన్ వారు పసందైన విందు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో చీరలు, చుడిదార్లు, గాజులతో నిండిన ఎన్నో స్టాల్ లు అతివలకోసం ఏర్పాటుచేశారు. అక్కడే టాక్స్ ఫైలింగ్ ఏర్పాట్లు, యోగ, ఆర్యోగ సంబంధిత స్టాల్ ల ద్వారా ఎన్నో విషయాలు తెలిపారు. సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త జ్యోతి వనం , ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన టచ్ నైన్ రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. -
ఉప్పలపాటి అధ్యక్షతన టాంటెక్స్ నూతన కార్యవర్గం
డాలస్, ఫోర్ట్ వర్త్ : తెలుగు సంస్కృతి, తెలుగు భాష కోసం అహర్నిషలు కృషి చేస్తున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) 2017 సంవత్సరానికి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఇర్వింగ్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో టాoటెక్స్ 2017 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. టాంటెక్స్ అధ్యక్షుడిగా ఉప్పలపాటి కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. టాంటెక్స్ లాంటి సంస్థకు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు టాంటెక్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే టాంటెక్స్ అధ్యక్షడిగా పదవీ విరమణ చేసిన జొన్నల గడ్డ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఉప్పలపాటి కృష్ణారెడ్డి నేతృత్వంలోని కార్యవర్గ బృందానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. టాంటెక్స్ అధికారిక కార్యనిర్వాహక బృందం.. అధ్యక్షుడు : ఉప్పలపాటి కృష్ణారెడ్డి సంయుక్త కార్యదర్శి : కోడూరు కృష్ణారెడ్డి ఉత్తరాధ్యక్షులు: శీలం కృష్ణవేణి కోశాధికారి : గోవాడ అజయ్ ఉపాధ్యక్షుడు : వీర్నపు చిన్న సత్యం సంయుక్త కోశాధికారి : మండిగ శ్రీలక్ష్మీ కార్యదర్శి : కాజ చంద్రశేఖర్ పాత అధ్యక్షుడు: జొన్నలగడ్డ సుబ్రమణ్యం ఇతర సభ్యలు : ఆదిభట్ల మహేష్ ఆదిత్య, పాలేటి లక్ష్మీ, బిళ్ల ప్రవీణ్, సింగిరెడ్డి శారద, కొణిదల లోకేష్ నాయుడు, బ్రహ్మదేవర శేఖర్ రాజ్, పార్నపల్లి ఉమా మహేష్, పద్మశ్రీ తోట, తోపుదుర్తి ప్రబంధ్ రెడ్డి, కసగాని మనోహర్, లంక భాను, ఎర్రం శరత్, ఇల్లెందుల సమీర. పాలక మండలి అధిపతి : రొడ్డ రామకృష్ణా రెడ్డి, ఉపాధిపతి : పావులూరి వేణుమాధవ్, ఇతర సభ్యులు : డా. సిరిపిరెడ్డి రాఘవరెడ్డి, పుట్లూరు రమణ, రుమాళ్ల శ్యామ, కొనార రామ్, కన్నెగంటి చంద్రశేఖర్. -
అత్యద్భుతంగా నెల నెలా తెలుగు వెన్నెల
టెక్సస్ : అమెరికా తెలుగు వీధికి శాశ్వత చిరునామా అయిన డాలస్‌లో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' ఘనంగా నిర్వహించారు. నెల నెలా తెలుగు వెన్నెల 9వ సాహిత్య వేదిక వార్షికోత్సవంతో పాటు108వ సదస్సు ఆదివారం సెయింట్ మేరీ మలంకారా చర్చి ఆడిటోరియంలో నభూతో న భవిష్యతి అన్న రీతిలో అత్యంత శోభాయమానంగా జరిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ ఇలా వివిధ తెలుగు ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు, ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను, వ్యావహారిక శైలిని కళ్ళకు కట్టినట్లు వివరించి, ప్రాంతాలు వేరైనా , యాసలు వేరైనా మనమంతా తెలుగు తల్లి బిడ్డలం అని ఘనంగా చాటిచెప్పారు. ఇంతకు ముందెన్నడూ జరిగని ఈ అపురూప సమాగమం, అత్యద్భుత వ్యాఖ్యాన సుందరదృశ్యకావ్యం మనసుకు హత్తుకుని మైపరిచిపోయేలా చేశాయి. టాంటెక్స్ కమిటీ సభ్యులు , సాహిత్య వేదిక సభ్యులు జ్యోతి ప్రజ్వలనం గావించగా, ఎల్ఎంఏ మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు మధురంగా గానం చేయగా 9వ వార్షిక ఉత్సవం ప్రారంభమైంది. సాహిత్య వేదిక సమన్వయకర్త ప్రవీణ్ బిళ్ళా మాట్లాడుతూ, 108 నెలల క్రితం నాటిన సాహిత్య వేదిక విత్తనం దిన దిన ప్రవర్ధమానం చెంది, ఈనాడు ఒక వట వృక్షమై ఎందరో తెలుగు అభిమానులకు మధుర ఫలాలు అందిస్తోందని, ఇది సంగీత సాహిత్యాలు ఒకటిగా పెనవేసుకున్న మణిహారమన్నారు. టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ , 2007 లో మొదలు పెట్టిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఇన్ని నెలలుగా నిరాటంకంగా కొనసాగుతూ ఉత్తర అమెరికాలో మొట్టమొదటి సుదీర్ఘ తెలుగు కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన గొప్ప రచయితలు,వక్తలు ప్రసంగించారు. -
ఘనంగా టాంటెక్స్ 105 వ సాహిత్య సదస్సు
-
ఘనంగా టాంటెక్స్ 105 వ సాహిత్య సదస్సు
డాలస్/ఫోర్టువర్త్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన 'నెలనెలా తెలుగు వెన్నెల' 105వ సాహిత్య సదస్సు ఆద్యంతం భాషామృతాన్ని కుమ్మరించింది. దేశీప్లాజా టీవీ స్టుడియోలో నిర్వహించిన ఈ సదస్సులో ఉగాది కవి సమ్మేళనంతోపాటు నిర్వహించిన తెలుగు ప్రక్రియలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్లా ప్రవీణ్ సభకు అధ్యక్షత వహించారు. ప్రారంభోపన్యాసం అనంతరం 'శ్రీ గణనాథం' గీతాలాపనతో దుర్ముఖినామ సంవత్సర కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్ధండులతోపాటు ఔత్సాహికులు కవితలు, పద్యాలు, ప్రసంగాలు చేశారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 'నవల- కథన శిల్పం' అంశంపై డాక్టర్ సి. మృణాళిని ప్రసంగించారు. ప్రముఖ కవి జొన్నవిత్తుల రాసిన 'తెలుగు పద్యముల ప్రసాదం' పద్యాన్ని చిన్నారి పాలూరి ఇతిహాస శ్రావ్యంగా పఠించింది. డాక్టర్ దొడ్ల రమణ తాను రచించిన 'బంధాలు చిరకాలం ఉండవు' పద్యమాలికను చదివి వినిపించారు. వేముల లెనిన్ శ్రీశ్రీ వర్షధారను పాడారు. మద్దుకూరి చంద్రహాసన్ 'ఉగాది కవిత.. మమత' చచనను ఆహుతులతో పంచుకున్నారు. కాజా సురేశ్ సీస పద్యాన్ని, జువ్వాడి రమణ హాస్య పద్యాన్ని వినిపించారు. మాడ దయాకర్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సేవలను కొనియాడారు. నందివాడ ఉదయ భాస్కర్ తన ఉగాది కవితలో రాజకీయాంశాలను ప్రస్తావించారు. పుదూర్ జగదీశ్వర్ పద్యాలు, పెనుగొండ ఇస్మాయిల్.. నటి మధుబాలపై రాసిన కవితను పఠించారు. ఇలా అందరికి అందరూ తమదైన విభిన్న శైలిలో తెలుగు వ్యాకరణ ప్రక్రియలో నచ్చిన అంశాన్ని ప్రదర్శించారు. సాహితీ వేదిక నిర్వహకులు ఆహూతులకు ఉప్పు- కారంతో పచ్చి మామిడి ముక్కలు, దోర జామపడ్లను అందించడంతోపాటు అచ్చతెలుగు భోజనాన్ని ఏర్పాటుచేశారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సమన్వయకర్త బిళ్లా ప్రవీణ్, సాహిత్య వేదిక బృందం, టెంటెక్స్ కార్యవర్గం అంతా కలిసి ముఖ్యఅతిథి డాక్టర్ సి. మృణాళినిని ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా బిళ్లా ప్రవీణ్ మాట్లాడుతూ దుర్ముఖి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని కవిసమ్మేళనం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆచార్య మృణాళినికి, ఆహూతులుగా విచ్చేసిన భాషాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాసరెడ్డి, సభ్యులు రొడ్డ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, తక్షణపూర్వాధ్యక్షుడు డాక్టర్ ఊరిమిండి నరసింహారెడ్డి, సభ్యులు పావులూరి వేణుమాధవ్, వనం జ్యోతి, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి, సాహిత్య వేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, జలసూత్రం చంద్ర తదితరులు పాల్గొన్నారు.