టెక్నాలజీని ఆమె బాగా వాడారు.. వైరల్ వీడియో | Women video viral in social media | Sakshi
Sakshi News home page

టెక్నాలజీని ఆమె బాగా వాడారు.. వైరల్ వీడియో

Published Wed, Oct 4 2017 10:02 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Women video viral in social media - Sakshi

సోషల్ మీడియాలో ఇటీవల పోస్ట్ అయిన ఓ వీడియో వైరల్ గా మారింది. పైగా సెలబ్రిటీల మనసు దోచుకుంటోంది. 'నాన్నకు ప్రేమతో' మూవీలో 'ఐ వాన్నా ఫాలో ఫాలో యూ..' అనే పాటలో హీరో ఎన్టీఆర్ ఓ హోవర్ బోర్డుపై కదలడం చూశారు కదూ. అయితే అంతగా ఈ టెక్నాలజీ మనకు అందుబాటులోకి రాకున్నా ఓ ప్రాంతంలో మాత్రం ఈ హోవర్ బోర్డును ఓ మహిళ వినూత్నంగా ఉపయోగించారు.

అలాగని తారక్ లాగ రోడ్లపై ఆమె ముందుకు సాగిపోలేదు. ఓ మహిళ హోవర్డ్‌ బోర్డుపై కూర్చుని తన ఇంటి ఆవరణలో శుభ్రం చేస్తుంటే ఆమె సన్నిహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక క్షణాల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. 'టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించారు. భారత్‌ ముందుకెళ్తుంది, మాడ్రన్ టైమ్స్ అంటూ' నటి మంచు లక్ష్మీ కూడా ఈ వీడియోను ట్వీట్ చేశారు. డిజిటల్ ఇండియా అంటే ఇదేనేమో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో అంతగా ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement