కొత్త చరిత్రకు నాంది.. సైనికులు గాల్లో ఇలా..!
'హోవర్‌బోర్డ్' ఈ పేరు వినే ఉంటారు కదా. దీని గురించి పిల్లలకు బాగా తెలుసు. వారు టీవీల్లో వీక్షించే సూపర్‌హీరో ప్రోగ్రామ్స్‌లో ఇది ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటుంది. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ హోవర్బోర్డును చూపించారు. అయితే ఇప్పటివరకూ సినిమాల్లో హీరోయిక్ సన్నివేశాలకు పరిమితమైన హోవర్‌బోర్డు టెక్నాలజీని దేశ రక్షణ కోసం వాడబోతున్నారు.
అవును. ఫ్రాంకీ జపట అనే కంపెనీ ఈ మేరకు అమెరికాకు ప్రతిపాదనలు కూడా చేసింది. గంటకు 93 మైళ్ల టాప్ స్పీడ్‌తో ఈ హోవర్ బోర్డులు గాల్లో ఎగురుతాయని తెలిపింది. సైనికుల కోసం ప్రత్యేకంగా హోవర్బోర్డులు తయారు చేస్తామని అమెరికా రక్షణ శాఖకు ఫ్రాంకీ ప్రతిపాదించింది. కాగా, దీనిపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
హోవర్బోర్డులను సైనికులు వినియోగించడానికి అమెరికా అనుమతిస్తే రక్షణ రంగంలో కొత్త యుగానికి నాంది పలికినట్లు అవుతుంది. ఓ వ్యక్తి హోవర్‌బోర్డు మీద ఎగురుతున్న వీడియో క్లిప్‌ను ఫ్రాంకీ విడుదల చేసింది. అయితే, బోర్డు ఎలా పని చేస్తుంది తదితర వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. ఫ్రాంకీ విడుదల చేసిన వీడియోలో బోర్డు మీద ఉన్న వ్యక్తి బీచ్‌లో వేగంగా ఎగురుతూ విన్యాసాలు చేశాడు.
చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ టెక్నాలజీ రక్షణ రంగానికి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో యుద్ధాలకు సైనికులు హోవర్బోర్డుల మీద వెళ్తే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించండి. కౌంటర్ టెర్రరిజానికి హోవర్‌బోర్డు టెక్నాలజీ బాగా ఉపయోగపడేలా కనిపిస్తోందపడం అతిశయోక్తి కాదు.